AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsham Movie: వర్షం సినిమాకు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదా..? ఏ హీరో చేయాల్సి ఉందంటే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో ఈ హీరో ఫాలోయింగ్ అమాంతం మారిపోయింది. దీంతో విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. దీంతో ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Varsham Movie: వర్షం సినిమాకు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదా..? ఏ హీరో చేయాల్సి ఉందంటే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2024 | 4:51 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే సలార్, కల్కి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఇవే కాకుండా వచ్చే నెలలో మరిన్ని చిత్రాలు పట్టాలెక్కనున్నాయి. దీంతో డార్లింగ్ అప్ కమింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వర్షం. డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో చెన్నై సోయగం త్రిష కథానాయికగా నటించింది. ఇందులో గోపిచంద్ విలన్ పాత్రలో రఫ్ఫాడించాడు. అలాగే ఈ మూవీలో ప్రకాష్ రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్రమోహన్ కీలకపాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమాకు సాంగ్స్ మరింత హైలెట్. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక అదిరిపోయింది. ఇప్పటికీ వర్షం సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004లో జనవరి 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. దాదాపు 125 కేంద్రాలలో 50 రోజులు.. 95 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. అలాగే 24 కేంద్రాలలో 175 రోజులు ఆడిన సినిమా ఇదే. మొత్తం మూడు నంది అవార్డులతోపాటు మరిన్ని పురస్కారాలను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదట. అవును.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శోభన్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. వర్షం మూవీ స్టోరీ ముందు మహేష్ వద్దకే వెళ్లిందట. కానీ అప్పుడు వేరే కారణాలతో మహేష్ చేయకపోవడంతో ఈ స్టోరీ ప్రభాస్ వద్దకు వెళ్లింది. కానీ ఇదే సినిమా డార్లింగ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే