Soundarya: సౌందర్య నటించి నిర్మించిన ఏకైక చిత్రం ఇది.. అంతా అతడి కోసమే.!

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని రూపం సౌందర్య. కోట్లాది మంది మనసులలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. సహజ నటనతో వెండితెరపై అద్భుతం సృష్టించింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

Soundarya: సౌందర్య నటించి నిర్మించిన ఏకైక చిత్రం ఇది.. అంతా అతడి కోసమే.!
Soundarya

Updated on: Feb 26, 2025 | 10:07 AM

తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత సౌందర్య. ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్. అద్భుతమైన నటన.. సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలోనే కనిపిస్తూ.. కేవలం నటనతోనే నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది. సౌందర్య మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతుంటారు. సౌందర్య కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ మారిందని మీకు తెలుసా.. ? అంతేకాదు.. ఆమె స్వయంగా నటించి ఓ చిత్రాన్ని నిర్మించింది.

కర్ణాటకలో పుట్టి పెరిగిన సౌందర్య తమిళం, తెలుగు, కన్నడ భాషలలో నటించింది. సౌందర్య సినిమా కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి సత్యనారాయణ అయ్యర్ కన్నడలో రచయిత, నిర్మాత. ఎన్నో చిత్రాలను నిర్మించారు. తన తండ్రి వల్లే సినిమాల్లోకి అడుగుపెట్టింది సౌందర్య. ఒక సినిమాలో చిన్న పాత్ర కోసం అమ్మాయిని వెతుకుతుండగా.. స్కూల్లో ఉన్న సౌందర్యను తీసుకువచ్చి ఆ పాత్ర పోషించేలా చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా సౌందర్యకు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత చదువు మానేసి సినిమాల్లోకి వచ్చేసింది. తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. సంవత్సరానికి ఏకంగా నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండేది. సౌందర్య నటిగా తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించారు. ఆయన ఆకస్మిక మరణం సౌందర్యను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అప్పుడే తన తండ్రి కోసం ఏదైనా చేయాలనుకున్నారట. తాను నిర్మాతగా మారి తండ్రికి నివాళిగా ఓ సినిమా తీయాలనుకున్నారట. తన తండ్రి పేరుతో `సత్య మూవీ మేకర్స్` అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి 2002లో `తీవు` చిత్రాన్ని నిర్మించారు సౌందర్య. కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించారు. ఇది మహిళలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సినిమా. ఇందులో సౌందర్య స్వయంగా హీరోయిన్ గా నటించడం గమనార్హం. ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం. ఆ తర్వాత మరో సినిమా నిర్మించలేదు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..