ఏంటీ..! మనసంతా నువ్వే హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..! చూస్తే షాక్ అవ్వాల్సిందే

2001లో వచ్చిన ఈ అందమైన ప్రేమ కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతను ఎక్కువ ఆకర్షించింది ఈ సినిమా. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మానసంతా నువ్వే సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ సంగీతం అందించారు.

ఏంటీ..! మనసంతా నువ్వే హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..! చూస్తే షాక్ అవ్వాల్సిందే
Manasantha Nuvve

Updated on: Feb 15, 2024 | 8:05 PM

ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమ కథల్లో చాలా సినిమాలు ప్రేక్షకుల మనసును తాకాయి. వాటిలో మనసంతా నువ్వే సినిమా ముందు వరసలో ఉంటుంది. 2001లో వచ్చిన ఈ అందమైన ప్రేమ కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతను ఎక్కువ ఆకర్షించింది ఈ సినిమా. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మానసంతా నువ్వే సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇప్పటికి ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రీమాసేన్.  మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది.

తెలుగులో రీమాసేన్ చిత్రం, మనసంతా నువ్వే, అదృష్టం, బావ నచ్చాడు, నీతో వస్తా సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళ్‌లో చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అలాగే హిందీలోనూ మెరిసింది. ఇదిలా ఉంటే రీమాసేన్ ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అని చాలా మంది నెటిజన్స్ వెతుకుతున్నారు. పెళ్లి తర్వాత రీమాసేన్ సినిమాకు గుడ్ బై చెప్పింది.

రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012 లో వివాహం చేసుకుంది. ఆమె 2013 ఫిబ్రవరి 22న వారి మొదటి బిడ్డ రుద్రవీర్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది రీమాసేన్. ఈ అమ్మడు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాజాగా రీమాసేన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

రీమాసేన్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్..

రీమాసేన్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్..

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.