AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ? బంగ్లా, వాహనాలతో పాటు ఏమేమి ఇస్తారంటే..

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం గవర్నర్ సమక్షంలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. తన నటనా జీవితంలో దళపతి అనే పేరు సంపాదించుకున్న ఆయన సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచారు. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నెలసరి జీతం ఎంత అందుకుంటారు? ఇంకా ఎలాంటి ప్రయోజనాలు తీసుకుంటారు అనేది తెలుసుకుందామా.

Vijay Thalapathy: కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ? బంగ్లా, వాహనాలతో పాటు ఏమేమి ఇస్తారంటే..
Tvk Party Chief Joseph Vijay
Rajitha Chanti
|

Updated on: May 11, 2026 | 2:38 PM

Share

దళపతి విజయ్ ఆదివారం తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా వెండితెరపై హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజా సేవ చేసేందుకు సిద్ధణయ్యారు. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచారు. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నెలసరి జీతం ఎంత అందుకుంటారు..? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా. తమిళనాడు ముఖ్యమంత్రికి నెలసరి వేతనం రూ. 2,05,000 లభిస్తుంది, ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ. అయితే, వివిధ అలవెన్సులతో కలిపి సీఎం విజయ్‌కు మొత్తం నెలసరి వేతనం రూ. 2,85,000 అందుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

విజయ్‌కు లభించే ప్రయోజనాలు..

ఇతర అలవెన్సులతో పాటు, ఎమ్మెల్యేలు ప్రత్యేక నియోజకవర్గ అలవెన్సు (CVA)ను పొందుతారు. ఈ CVAలో విలాస భత్యం (sumptuary allowance) , రోజువారీ భత్యం (daily allowance) ఉంటాయి, వీటిని అధికారిక పనులు , సమావేశాలకు సంబంధించిన ఖర్చుల కోసం చెల్లిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా, విజయ్‌కు చెన్నైలోని ఒక విలాసవంతమైన ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ వసతి గృహాన్ని కేటాయిస్తారు. ఇందులో క్యాంప్ ఆఫీస్, సిబ్బందికి పూర్తి సదుపాయాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఖర్చుతో సీఎం విజయ్‌కు ఒక బుల్లెట్‌ప్రూఫ్ ఎస్‌యూవీ, వాహనాలతో కూడిన పూర్తి కాన్వాయ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, రాష్ట్ర లేదా కేంద్ర అధికారిక పర్యటనల సమయంలో, విమాన, రైలు లేదా రోడ్డు మార్గ ప్రయాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర అతిథిగా వసతి కూడా ఏర్పాటు చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ముఖ్యమంత్రిగా, సీఎం విజయ్‌కు 30 మందికి పైగా ఉన్నత శ్రేణి కమాండోలు, పోలీసు సిబ్బందితో కూడిన జెడ్+ కేటగిరీ భద్రత కల్పించబడుతుం. వీరు ఇరవై నాలుగు గంటలూ విధుల్లో ఉంటారు. పదవీ విరమణ తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లభించే ప్రయోజనాలలో పెన్షన్, వైద్య సౌకర్యాలు, ఉచిత రైలు ప్రయాణం , పరిమిత సిబ్బందితో కార్యాలయ నిర్వహణ వంటివి ఉంటాయి.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us