AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 కోట్ల విలువైన భూమి కబ్జా.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, భార్య, కుమారుడిపై కేసు నమోదు

శ్రీకాకుళంలో రూ.3-4 కోట్ల విలువైన భూమిని నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో కాజేయాలన్న భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడితో సహా 13 మందిపై కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో నకిలీ పత్రాల సృష్టి, బతికున్నవారిని చనిపోయినట్లు చూపడం వంటి అక్రమాలు బయటపడ్డాయి.

4 కోట్ల విలువైన భూమి కబ్జా.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, భార్య, కుమారుడిపై కేసు నమోదు
Srikakulam Sp
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jul 19, 2026 | 9:00 PM

Share

శ్రీకాకుళంలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని కాజేయాలన్న భారీ కుట్ర వెలుగు చూసింది. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు భూకబ్జా ముఠా గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌లతో పాటు మొత్తం 13 మందిపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మందిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న త్రినాథ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ కేసులో తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ A -5గా, తమ్మినేని సీతారాం A -6 గా, ఆయన భార్య A -7గా ఉండగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SP తెలిపారు. 2022లో శ్రీకాకుళం చాపురం పంచాయతీ పరిధిలోని శ్రీ సత్య సాయి నగర్ లేవట్లోని సర్వే నంబర్ 35/13లో 84,85,86 ప్లాట్ నెబర్లుతో ఉన్న 900 గజాల స్థలాన్ని తమ్మినేని కుమారుడు తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలం అసలు యజమాని అందవరపు గోవిందరాజులు ఉద్యోగరీత్యా హైదరాబా‌ద్‌లో నివసిస్తున్న కారణంగా ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉండటాన్ని గమనించిన కొందరు వ్యక్తులు, ముందస్తు పథకం ప్రకారం దానిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నారు.

భూ యజమాని బతికుండగానే..

ఈ భూ కబ్జా కుట్రలో భాగంగా ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన యజమాని అందవరపు గోవిందరాజులు పేరు మీద ఉన్న అసలు లింక్ డాక్యుమెంట్లను సేకరించిన నిందితులు, జీవించి ఉన్న గోవిందరాజులును మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. గోవిందరాజులకు అందవరపు రజినీ అనే కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గోవిందరాజుల సంతానంగా అందవరపు రజిని అనే ఏకైక కుమార్తె మాత్రమే ఉందని పేర్కొంటూ ఒరిస్సా లోని జైపూర్‌కు చెందిన అడబాల రజిని అనే మహిళను నకిలీ వారసురాలిగా చూపించి నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను సృష్టించారు నిందితులు. A.రజని పేరిట అడబాల రజినికి ఆధార్ కార్డ్ క్రియేట్ చేశారు. అడపాల రజనీనే అందవరపు రజినిగా నకిలీ వారసురాలుగా పేర్కొంటూ స్థలాన్ని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగుకి అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ చేసిన నిందితులు. ఈ మొత్తం వ్యవహారంలో రియల్ ఎస్టేట్ మీడియేటర్, మాజీ హోంగార్డ్ ఆయన త్రినాథ్ అనే వ్యక్తి సహకారంతో తెలుగు సతీశ్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెట్లు తయారు చేయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేయించాడు. అయితే వీరందరితో తమ్మినేని చిరంజీవి నాగ్ ఇవన్నీ చేయించినట్లు SP తెలిపారు.

సబ్ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు..

ఈ నేరంలో అప్పటి సబ్ రిజిస్టర్ బొడ్డేపల్లి అరుణ ప్రమేయం కూడా ఉన్నట్లు తేల్చిన పోలీసులు. రిజిస్ట్రేషన్ నిబంధనలు ప్రకారం రూ.5 లక్షలకు మించి జరిపే క్రయ విక్రయాలకు పాన్ కార్డ్ వివరాలు పొందపరచాలి. కానీ వారిని నుండి పాన్ వివరాలు సబ్ రిజిస్ట్రార్ తీసుకోలేదు. ఒకవేళ సదరు వ్యక్తికి పాన్ కార్డు లేకపోతే దఫదఫాలుగా ఆ డబ్బులు వారికి అందజేసినట్టు పేర్కొంటూ ఫారం 60 ని పిల్ చేసి, అందులో సంతకం కూడా ఆధార్ లో పేర్కొన్న విధంగా పూర్తి పేరుతో రాయవలసి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకపోయినా అప్పుడు రిజిస్టర్ అరుణ రిజిస్ట్రేషన్ చేయటంతో ఆమె పైన కేసు నమోదు చేశారు పోలీసులు.

కాలేజీ సిబ్బందితో సాక్ష్య సంతకాలు

రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్‌పై సాక్షి సంతకాలు చేసిన నలుగురు వ్యక్తులు ఆముదలవలసలోని తమ్మినేని సీతారాంకు చెందిన ప్రైవేట్ కాలేజీలో సిబ్బందిగా పనిచేస్తున్న వారిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలం చుట్టూ తమ్మినేని ఇటీవల ప్రహరీ గోడ నిర్మించే ప్రయత్నం చేయగా, అసలు యజమాని కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో వారిని బెదిరించగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు చేపట్టిన సమగ్ర దర్యాప్తు చేసి నిదితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా నకిలీ వారసురాలిగా నటించిన అడబాల రజిని, ఆమె అల్లుడు సాలిపల్లి లక్ష్మణరావు, తెలుగు సతీష్, తప్పుడు లావాదేవీకి సాక్షులుగా వ్యవహరించిన ఉపేందర్, గోపి, సాంబమూర్తి, ఉపేంద్రతో పాటు డాక్యుమెంట్ రైటర్ కోనా పెద్దిరాజును అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

ఈ నేర కుట్ర దర్యాప్తులో A5 తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని, A6 తమ్మినేని సీతారాం (మాజీ స్పీకర్), A7 తమ్మినేని వాణిలు ఇతర నిందితులతో కుమ్మక్కై, దురుద్దేశపూర్వకంగా తప్పుడు, నకిలీ పత్రాలను సృష్టించి సుమారు రూ.3 కోట్ల విలువైన ఖాళీ స్థలాలను అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత భూ రికార్డులు, యాజమాన్య పత్రాలు, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా పరిశీలించుకోవాలని జిల్లా SP మహేశ్వర రెడ్డి ప్రజలకు సూచిస్తూన్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, భూ కబ్జాలకు పాల్పడడం వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us