Ration: గుడ్‌న్యూస్.. మరోసారి 3 నెలల రేషన్ సరుకులు.. ఆగస్టు 1 నుంచి పంపిణీ
Free Ration: ఇది వరకు సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనుండటంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం..

Free Ration: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆహార సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పుడు రేషన్ కార్డు లబ్దిదారులు మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సరిపడా రేషన్‌ను ఏకకాలంలో కేటాయించాలని సంబంధిత శాఖ నిర్ణయించింది. వర్షాకాలంలో తలెత్తే రవాణా, నిల్వ సవాళ్లను పరిష్కరించి, తద్వారా దేశంలోని పేద కుటుంబాలు రేషన్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యం. ఆగస్ట్ 1వ తేదీ నుంచి మూడు నెలలు అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన సరుకులు ఒకేసారి ఇవ్వనున్నారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద ఈ రేషన్‌ను లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. కార్డుదారులు గానీ, ఫెయిర్ ప్రైస్ షాపు యజమానులు గానీ ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
గతంలోనూ ఒకేసారి :
ఇది వరకు సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనుండటంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం అందించాల్సి ఉంది. ప్రతి రేషన్ కార్డుదారు మూడుసార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు రెండు, మూడుసార్లలో సరిపడా బియ్యాన్ని రవాణా చేస్తారు. చిన్న దుకాణాలకైతే ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండు, మూడుసార్లు నిల్వకు అనుగుణంగా రవాణా చేస్తారు. గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్నూ ఇలాగే ఒకే నెలలో పంపిణీ చేశారు.
ఇది కూడా చదవండి: Restaurants: రెస్టారెంట్‌కు వెళ్తున్నారా? బిల్లులో ఆ ఛార్జీలు వేస్తే అస్సలు కట్టకండి.. ప్రభుత్వం సీరియస్ యాక్షన్!
ఇది కూడా చదవండి: LPG Cylinder: గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే చూడొచ్చు.. సరికొత్త సిలిండర్ వచ్చేసింది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




