దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! బన్నీ సినిమా హీరోయిన్ ఎంతలా మారిపోయిందో చూడండి

గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ డి బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బన్నీ సినిమా ఒకటి. 2008లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వి. వి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! బన్నీ సినిమా హీరోయిన్ ఎంతలా మారిపోయిందో చూడండి
Bunny

Updated on: Mar 07, 2024 | 12:00 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన బన్నీ ఇప్పుడు పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ డి బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బన్నీ సినిమా ఒకటి. 2008లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వి. వి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కూడా హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన అమ్మడు గుర్తుందా.? ఆ చిన్నదాని పేరు గౌరి ముంజల్.

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది. అల్లు అర్జున్ తో నటించిన బన్నీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. శ్రీ కృష్ణ 2006, గోపి, కౌసల్యా సుప్రజా రామ , బంగారుబాబు సినిమాల్లో నటించింది. అలాగే కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. 2011తర్వాత ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందా అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. అయితే గౌరి ముంజల్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. దాంతో ఆమె ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ఆమెకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పటికి ఇప్పటికి గౌరి ముంజల్ చాల మారిపోయింది. బొద్దుగా తయారైన ఈ చిన్నది ఇప్పటికి అదే సోయగంతో కవ్విస్తుంది.

గౌరి ముంజల్

గౌరి ముంజల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.