Kiara Advani – Sidharth Malhotra: కియారా, సిద్ధార్థ్ ఆస్తులు ఎంతంటే.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే ఈ బ్యూటీ తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కియారా పర్సనల్ లైఫ్, ఆస్తులు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Kiara Advani - Sidharth Malhotra: కియారా, సిద్ధార్థ్  ఆస్తులు ఎంతంటే.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
Kiara Advani

Updated on: Mar 02, 2025 | 6:56 PM

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపూల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తమ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు ఈ దంపతులు. “మా జీవితాల్లోకి మరో అద్భుతమైన బహుమతి రాబోతుంది” అంటూ తమ ఇద్దరి చేతులలో చిన్నారి సాక్స్ పట్టుకున్న ఫోటో షేర్ చేశారు కియారా. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇప్పుడు కియారా, సిద్ధార్థ్ పేర్లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ జంట పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో పవర్ కపుల్‌గా ఉండటమే కాకుండా, కియారా, సిద్ధార్థ్ కూడా పరిశ్రమలోని అత్యంత సంపన్న తారలలో ఉన్నారు.

సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారరంగాల్లో పెట్టుబడుల ద్వారా హీరోయిన్ కియారా ఎక్కువగానే సంపాదిస్తుంది. అలాగే ఇప్పటివరకు ఆమె ఆస్తులు రూ.40 కోట్లు అని సమాచారం. కియారా ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ. 1.5 కోట్లు సంపాదిస్తుంది. ఈ నటి సెంకో గోల్డ్, గెలాక్సీ చాక్లెట్ల, మైంట్రా వంటి ప్రధాన బ్రాండ్‌లకు అంబాసిడర్.

ఇక కియారా భర్త బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా విషయానికి వస్తే.. అతడి ఆస్తులు రూ.105 కోట్లు అని అంచనా. బ్లాక్ బస్టర్ సినిమాలు, అధిక పారితోషికం ఇచ్చే ఎండార్స్‌మెంట్‌లు, పెట్టుబడుల ద్వారా అతని సంపాదన వస్తుంది. అతను ఒక్కో చిత్రానికి రూ. 15 కోట్ల నుండి రూ. 20 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. షేర్షా, మార్జావాన్ వంటి హిట్ చిత్రాలతో సిద్ధార్థ్ క్రేజ్ పెరిగిపోయింది. కియారా, సిద్ధార్థ్ ఇద్దరి ఆస్తులు కలిపి 145 కోట్ల రూపాయలు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..