AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోలకు మించిన క్రేజ్.. విలనిజంతో రఫ్పాడించిన స్టైలీష్ విలన్.. రఘువరన్ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనదైన నటన , విలక్షణమైన శైలితో చెరగని ముద్ర వేసిన నటుడు రఘువరన్. తెలుగు, తమిళం భాషలలో దాదాపు 200ల చిత్రాల్లో నటించి మెప్పించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలే కాకుండా సహయ నటుడిగానూ మెప్పించారు. కానీ అనారోగ్య సమస్యలతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు.

హీరోలకు మించిన క్రేజ్.. విలనిజంతో రఫ్పాడించిన స్టైలీష్ విలన్.. రఘువరన్ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Raghuvaran
Rajitha Chanti
|

Updated on: May 07, 2026 | 11:57 AM

Share

“శివ శివ శివ.. ఎవడా శివ?” అంటూ ‘శివ’ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్. విలనీకి ఒక కొత్త అర్థాన్ని చెప్పిన నటుడు రఘువరన్. అరుపులు, భయంకరమైన మేకప్‌లు లేకుండా కేవలం తన హావభావాలతో, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను భయపెట్టగల సామర్థ్యం ఆయన సొంతం.రఘువరన్ కేరళలో జన్మించినా, కోయంబత్తూరులో పెరిగారు. తండ్రి హోటల్ వ్యాపారంలో ఉన్నా, రఘువరన్ మాత్రం బి.ఏ సైకాలజీ పూర్తి చేసి సినిమాలపై మక్కువతో మద్రాస్ వచ్చారు.హీరోగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన, ఆ తర్వాత విలక్షణ పాత్రల వైపు మొగ్గు చూపారు. తెలుగులో ‘పసివాడి ప్రాణం’ చిత్రంలో వికలాంగుడైన విలన్‌గా ఆయన నటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

‘శివ’ సినిమాలో భవాని పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మొదట్లో దర్శకుడు వర్మ ఆయనను వద్దనుకున్నా, నాగార్జున పట్టుబట్టి ఆ పాత్ర ఇప్పించారు. రఘువరన్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాలేదు. ‘సుస్వాగతం’లో పవన్ కళ్యాణ్ తండ్రిగా, ‘అంజలి’లో ఒక చిన్న పాపకు తండ్రిగా ఆయన అద్భుతమైన నటనను కనబరిచారు. రజినీకాంత్‌తో ఆయనకు మంచి స్నేహం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భాషా’లోని ఆంటోనీ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర కోసం ఆయన ఎంతో హోంవర్క్ చేసి, రాజకీయ నాయకుల మేనరిజమ్స్‌ను ఒంటబట్టించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

నటి రోహిణిని ఆయన 1996లో తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి రిషివరన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, మద్యం. ఇతర వ్యసనాల కారణంగా వీరిద్దరూ 2004లో విడిపోయారు. తన వ్యసనాల గురించి ఆయన ఎంతో నిక్కచ్చిగా ఇంటర్వ్యూలలో మాట్లాడేవారు. ఆ వ్యసనాలే చివరకు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. 2008 మార్చి 19న రఘువరన్ కన్నుమూశారు. ఆయన మరణం దక్షిణాది చిత్రపరిశ్రమకు తీరని లోటు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Follow Us