AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే..

విజయ్ తలపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సొంతంగా రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆయన.. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక సీట్లు సంపాదించిన మెజారిటీ పార్టీగా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే..
Tvk Chief Vijay
Rajitha Chanti
|

Updated on: May 07, 2026 | 11:37 AM

Share

విజయ్ తలపతి.. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి తలపతి విజయ్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆయన పాత స్కూల్ మార్క్‌షీట్ మళ్లీ వెలుగులోకి రాగా నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, తన 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 65 శాతం మార్కులు సాధించారు. విజయ్ తన 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 1100 మార్కులకు గాను మొత్తం 711 మార్కులు సాధించి, 65 శాతం ఓవరాల్ పర్సెంటేజ్ పొందారు. విజయ్ తన మాతృభాష అయిన తమిళంలో 200కి 155 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

ఇంగ్లీషులో 200కి 133, సైన్స్‌లో 300కి 206, సోషల్ సైన్స్‌లో 200కి 122, గణితంలో 200కి 95 మార్కులు సాధించాడు. మ్యాథ్స్ సబ్జెక్టులో అత్యల్పంగా మార్కులు వచ్చాయి. విజయ్ తన ప్రాథమిక విద్యను చెన్నైలో ప్రారంభించాడు. అతను మొదట కోడంబాక్కంలోని ఫాతిమా పాఠశాలలో చదివి, ఆ తర్వాత విరుగంబాక్కంలోని బాలలోక్ పాఠశాలకు మారారు. తన 10వ తరగతి బోర్డు పరీక్షలు రాశారు. పాఠశాల విద్య పూర్తి చేశాక, తలపతి విజయ్ విజువల్ కమ్యూనికేషన్ చదవడానికి చెన్నైలోని లయోలా కళాశాలలో చేరాడు . అయితే అదే సమయంలో నటనపై ఆసక్తి పెరగడంతో డిగ్రీ మధ్యలోనే ఆపేశారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

విజయ్ దళపతి సినీ ప్రయాణం మూడు దశాబ్దాల పాటు సాగి, భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 1992లో తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘నాలయ్య తీర్పు’ చిత్రంతో కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టేందుకు రెడీ అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Follow Us