Tollywood: 16 ఏళ్లకే ముఖ్యమంత్రి కొడుకుతో ప్రేమ.. సినిమాలు వదిలేసి ఇప్పుడేం చేస్తుందంటే..

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు తోపు హీరోయిన్. 16 ఏళ్ల వయసులోనే వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ముఖ్యమంత్రి కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Tollywood: 16 ఏళ్లకే ముఖ్యమంత్రి కొడుకుతో ప్రేమ.. సినిమాలు వదిలేసి ఇప్పుడేం చేస్తుందంటే..
Genelia

Updated on: May 29, 2025 | 9:02 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. 16 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి కొడుకు.. స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు సినిమాలు వదిలేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే.. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ జెనీలియా డిసౌజా.

ఆగస్టు 5, 1987న జన్మించిన జెనీలియా తల్లి జీనెట్ డిసౌజా ఒక ఫార్మాస్యూటికల్ బహుళజాతి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తండ్రి నీల్ డిసౌజా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సీనియర్ పదవిలో ఉండేవారు. చిన్న వయసులోనే నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తుజే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించారు. తొలి చిత్రంలోనే ఏర్పడిన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. పదేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2012లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

రాజకీయ కుటుంబానికి చెందిన రితేశ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు. మొదట్లో వీరి ప్రేమను రితేశ్ తండ్రి అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత వీరి పెళ్లిని ఒప్పుకున్నారు. జెనీలియా, రితేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోడలు అయిన తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న జెనీలియా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..