Shah Rukh Khan Birthday: “హైదరాబాద్ టోలీచౌక్‌లో ఉండేవాడిని”.. షారుఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు షారుఖ్. ఈ స్టార్ హీరో ఎలాంటి పాత్రనైనా చక్కగా పోషిస్తారు. ఎమోషన్స్ పండించడంలో బాలీవుడ్ లో షారుఖ్ తర్వాతే అని చెప్పాలి. షారుఖ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. నేడు షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు.

Shah Rukh Khan Birthday: హైదరాబాద్ టోలీచౌక్‌లో ఉండేవాడిని.. షారుఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shah Rukh Khan

Edited By:

Updated on: Nov 02, 2023 | 2:08 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు నేడు. నేటి నుంచి ఆయన 58వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. కింగ్ ఖాన్ షారుఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు షారుఖ్. ఈ స్టార్ హీరో ఎలాంటి పాత్రనైనా చక్కగా పోషిస్తారు. ఎమోషన్స్ పండించడంలో బాలీవుడ్ లో షారుఖ్ తర్వాతే అని చెప్పాలి. షారుఖ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. నేడు షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు. సినీ సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. దాంతో షారుఖ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షారుఖ్ ఖాన్ ఇండియాలో స్టార్ హీరోల్లో ఒకరు. అలాగే అత్యంత రిచెస్ట్ హీరో గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కింగ్ ఖాన్ ఆస్తుల విలువ 6300 కోట్లకు పైగా ఉంటుంది. ఆయన నటించిన సినిమాలు వందకోట్లు దాటి వెయ్యి కోట్లు వసూల్ చేస్తున్నాయి. షారుఖ్ ఖాన్ కు ముంబై లో అత్యంత ఖరీదైన ఇల్లు ఉంది. మన్నత్ అనే పేరుతో విలాసవంతమైన ఇల్లు ఉంది.

ఇక షారుఖ్ ఖాన్ కు హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది. ఆయన హైదరాబాద్ లో నివసించారు. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ కు హైదరాబాద్ లో ఇల్లు ఉన్న విషయం బయటకు వచ్చిన.. హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని తెలిపిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మా అమ్మమ్మ హైదరాబాద్ లోని టోలిచౌకి లో ఉండేవారు. మా అమ్మ కుటుంబం మొత్తం ఇక్కడే ఉండేవారు. చిన్న తనంలో మా అమ్మమ్మ నను దత్తత తీసుకున్నారు.  నేను దాదాపు నాలుగేళ్లు ఇక్కడే గడిపాను. చిన్న తనంలో చార్మినార్ చూడటానికి రోజూ వెళ్ళే వాడిని అని తెలిపారు షారుఖ్.  నాలుగేళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత మేము బెంగుళూరు వెళ్లిపోయాం..అలాగే మా అమ్మగారు ఉన్న సమయంలో మేము సమ్మర్ కు హైదరాబాద్ వచ్చి వెళ్తు ఉండేవాళ్ళం అని తెలిపారు షారుఖ్. ఇప్పుడు ఈ వీడియో శోషొల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి