పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీనే అయినా ఇక్కడ ఇతర భాషల హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, ఒడియా, బెంగాళీ.. ఇలా పలు ఎన్నో రకాల భాషలకు చెందిన హీరోయిన్లు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా బెంగాళీనే. కానీ తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్ గా టాలీవుడ్ నుంచి మాయమైపోయింది. తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి సినిమాలు, సీరియల్స్ తో బిజీ బిజీగా మారిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు అమ్మగా మారిపోయింది. సాధారణంగా తల్లైన తర్వాత సినిమాలు, సీరియల్స్ తగ్గిస్తారు. కానీ ఈ అందాల తార మాత్రం మరింత స్పీడ్ పెంచింది. రియాలిటీ షోలు, టీవీ షోస్ తో బెంగాళీ ఆడియెన్స్ లో పాపులర్ నటిగా మారిపోయింది. ఇదే క్రేజ్ తో ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తన ఛరిష్మాతో తన ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థిపై ఏకంగా 70 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ప్రస్తుతం ఎంపీగా ప్రజా సేవలో బిజి బిజీగా ఉంటోన్న ఆ అందాల తార మరెవరో కాదు రచనా ఛటర్జీ. అదే నండి బావగారు బాగున్నారా సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన అమ్మాయి.
బెంగాల్ కు చెందిన రచన తెలుగులో పిల్ల నచ్చింది, కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది.కాగా 2002లో వచ్చిన లాహిరి లాహిరిలో సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదీ అందాల తార. కానీ తన సొంత రాష్ట్రంలో సినిమాలు, టీవీ షోలతో బిజీగా మారిపోయింది.
కాగా దీదీ నెం1 అనే టీవీషోతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రచన. ఇదే క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో హూగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగింది. తన పాపులారిటీ, ఛరిష్మాతో ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీపై ఏకంగా 70 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.