Bheemla Nayak: యూట్యూబ్‏లో భీమ్లా నాయక్ అడవి తల్లి సాంగ్ రికార్డ్స్.. ఈ పాట పాడిన దుర్గవ్వ గురించి తెలుసా..

|

Dec 04, 2021 | 9:05 PM

పవర్ స్టార్ పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో

Bheemla Nayak: యూట్యూబ్‏లో భీమ్లా నాయక్ అడవి తల్లి సాంగ్ రికార్డ్స్.. ఈ పాట పాడిన దుర్గవ్వ గురించి తెలుసా..
Bheemla Nayak
Follow us on

పవర్ స్టార్ పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, గ్లిమ్ప్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈరోజు విడుదైన అడవి తల్లి మాట పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తోంది ఈ పాట. ఈ పాటను ఫాక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి ఆలపించారు. ఇక ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో అడివి తల్లి మాట పాట పాడిన ఫోక్ సింగర్ దుర్గవ్వ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఏం చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉండేది. దుర్గవ్వ కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ అనేక పాటలు పాడారు. ఇక తెలుగులో దుర్గవ్వ పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతుంది. అలాగే సిరిసిల్లా చిన్నది లాంటి పాపులర్ పాటలు పాడారు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాలో దుర్గవ్వ పాడిన అడవి తల్లి మాట పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: Deepika Padukone: ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‏కు బాలీవుడ్ బ్యూటీ.. దీపికకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..

Manchu Vishnu: అచితూచి మాట్లాడండి.. ఇచ్చే స్టేట్‏మేంట్స్ ఇండస్ట్రీపై పడుతుంది.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..

Upasana Kamineni Konidela: రెండు సింహాలను దత్తత తీసుకున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన..