
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ డేస్ లో బాలయ్య చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అఖండ సినిమా దగ్గర నుంచి ఇటీవల వచ్చిన అఖండ 2 వరకు వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టారు నటసింహం. వరుసగా 5 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు బాలయ్య. బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్స్ కూడా కొంతమంది ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ బాలకృష్ణకు నాన్నమ్మ గా నటించింది. బాలయ్యకు నాన్నమ్మగానే కాదు లవర్ గానూ నటించి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
బాలయ్యతో కలిసి నాన్నమ్మగా, లవర్ గా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె మరెవరో కాదు అందాల భామ సిమ్రాన్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగలాంటి నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయ్యారి భామ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
కాగా ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా మెప్పించింది. బాలకృష్ణ, సిమ్రాన్ కాంబినేషన్ లో ఏకంగా 5సినిమాలు వచ్చాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమసింహం, ఒక్కమగాడు, గొప్పింటి అల్లుడు. వీటిలో ఒక్కమగాడు సినిమాలో సిమ్రాన్ బాలయ్యకు భార్యగా, నాన్నమ్మగా నటించింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ తాత మనవడిగా నటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి