Tollywood: 4 సినిమాలతోనే సంచలనం.. కట్ చేస్తే.. 34 ఏళ్లకే హఠాన్మరణం.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?

రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టాడు. పాలిటిక్స్ కాకుండా నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. మంచి నటుడిగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతనిని చూసి యాక్టర్ గా ఎంతో మంచి భవిష్యత్ ఉందనుకున్నారు. కానీ విధి ఈ నటుడిని చిన్న చూపు చూసింది.

Tollywood: 4 సినిమాలతోనే సంచలనం.. కట్ చేస్తే.. 34 ఏళ్లకే హఠాన్మరణం.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: Jul 16, 2025 | 8:44 PM

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం కావడంతో ఇతను కూడా పాలిటిక్స్ లోకి వస్తాడనుకున్నారు. కానీ నటనపై మక్కువుతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నటనంటే మక్కువతో పాటు కాస్త పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో వెంట వెంటనే సినిమా అవకాశాలు వచ్చాయి. హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. యాక్టర్ గా ఆడియెన్స్ లో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని యాక్టింగ్ ట్యాలెంట్ చూసి భవిష్యత్ లో మంచి నటుడవుతాడని చాలా మంది భావించారు. కానీ విధి ఈ హీరోపై చిన్న చూపు చూసింది. తన ఐదో సినిమా రిలీజ్ కు ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అది కూడా కేవలం 34 ఏళ్ల వయసులోనే. తద్వారా తన కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఆడియెన్స్ ను తీవ్ర విషాదంలోకి నెట్టాడు. ఈ విషాదం జరిగి ఇటీవలే 12 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో మరోసారి సినీ ప్రేమికులు ఆ నటుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తు పట్టారా? అభి సినిమా ఫేమ్ కమలాకర్. పూర్తి పేరు బూచే పల్లి కమలాకర్ రెడ్డి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బూచే పల్లి ఫ్యామిలీకి మంచి పేరుంది. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన కమలాకర్ పాలిటిక్స్ ను కాదనుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

మొదటి సినిమా అభితోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కమలాకర్. ఇందులో అతను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించి ఆడియెన్స్ ను మెప్పించాడు. సినిమా కూడా మంచి కలెక్షన్లు సాధించింది. అభి తర్వాత హాసిని, సన్నీ, సంచలనం సినిమాల్లో హీరోగా నటించాడు కమలాకర్. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. సాయి కుమార్ లాంటి సీనియర్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక తన ఐదో చిత్రం బ్యాండ్ బాలు సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. హైదరాబాద్ లో ఆడియో రిలీజ్ కూడా నిర్వహించారు. అయితే ఇక్కడే చిన్న అపశ్రుతి దొర్లింది. ఈ కార్యక్రమంలో హీరో కమలాకర్ ప్రమాదవశాత్తూ జారిపడి పోయారు. దీంతో వెంటనే ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన జులై 14న తుదిశ్వాస విడిచాడు. అప్పటికింకా అతని వయసు కేవలం 34 ఏళ్లే కావడం శోచనీయం. కమలాకర్ భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

కమలాకర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లి సుమారు12 సంవత్సరాలు గడిచాయి. ఇటీవల అతని వర్ధంతి కావడంతో సినీ అభిమానులు కమలాకర్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టుల పెట్టారు.

ఇవి కూడా చదవండి

Actor Kamalakar

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి