కితకితలు సినిమాలో తన నటనతో అందరినీ గిలిగింతలు పెట్టిన గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘పిల్లలూ.. కారులో అయినా బైక్‌పై అయినా జాగ్రత్తగా వెళ్లండి. కమెడియన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓం శాంతి’ అని ఆమె పోస్ట్ షేర్ చేశాడు. ఈ ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా కర్ణాటక రాష్ట్రంలో యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గీతా ఫ్యామిలీకి ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు. నిజానికి గీతాసింగ్ పెళ్లి చేసుకోలేదు. అయితే తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అన్నయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన ఇద్దరు కుమారుల భారాన్ని తన భుజాలపై వేసుకుంది గీతాసింగ్. ఆ ఇద్దరు పిల్లలతో పాటు తన కజిన్ కూతురిని కూడా సొంత పిల్లలుగా పెంచుకుంటున్నారీ లేడి కమెడియన్. ప్రస్తుతం తన జీవితంలో ఈ ముగ్గురు పిల్లలే తనకు జీవితమని.. తనకు ఇంకెవ్వరూ లేరని గీతాసింగ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.అయితే గీతాసింగ్ పెద్ద కుమారుడు నలుగురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని, అతను అక్కడికక్కడే కన్నుమూసినట్లు సమాచారం.
కాగా ఇండియా నుంచి వచ్చిన గీతాసింగ్ తెలంగాణలోనే స్థిరపడడంతో తెలుగు నేర్చుకున్నారు. ఆ తరవాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. ‘ఎవడిగోల వాడిది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈమె దగ్గరైన గీతాసింగ్ ఆ వెంటనే అల్లరి నరేష్ సరసన ‘కితకితలు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 50కు పైగా సినిమాల్లో నటించారు. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ మధ్య జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేశారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొని తన చేదు అనుభవాలను పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..