Kiran Abbavaram: హే కిరణ్.. ప్రేమలో ఉన్నావా..? ఆ హీరోయిన్‌ కూడా సేమ్ స్పాట్‌లో

|

Mar 10, 2023 | 3:34 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేమలో ఉన్నాడా..? అది కూడా ఆ హీరోయిన్‌తో.. ఫోటోలతో దొరికిపోయాడుగా....

Kiran Abbavaram: హే కిరణ్.. ప్రేమలో ఉన్నావా..? ఆ హీరోయిన్‌ కూడా సేమ్ స్పాట్‌లో
Kiran Abbavaram - Rahasya Gorak
Follow us on

కిరణ్ అబ్బవరం.. తెలుగు యంగ్ హీరో. పక్కంటి కుర్రాడిలా ఉంటాడు. అందర్నీ గౌరవిస్తాడు. 2 హిట్లు పడగానే కొందరిలా కొమ్ములు మొలిచినట్లు హడావిడి చెయ్యడు. డాబు ఉండదు. సినిమా కథలు కూడా వైవిథ్యంగానే ఎంచుకుంటాడు.  అందుకే అతడంటే అందరూ ఇష్టపడతారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. మంచి మార్కులే కొట్టేశాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ‘మీటర్‌’ అంటూ  థియేటర్లలోకి రాబోతున్నాడు.

అయితే ఈ హీరో లవ్‌లో ఉన్నాడనే వార్తలు ప్రజంట్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా ఓ హీరోయిన్‌తో. తాజాగా కశ్మీర్‌ ట్రిప్‌కు వెళ్లిన కిరణ్‌ అబ్బవరం​.. అక్కడ దిగిన పలు ఫోటోలను ఇన్ స్టాలో షేర్‌ చేశాడు. అక్కడే సేమ్‌ లొకేషన్స్‌తో హీరోయిన్‌ రహస్య గోరక్ కూడా ఫోటోలను షేర్‌ చేయడంతో వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ నడుస్తుందని నెటిజన్లు అంటున్నారు.

‘రాజావారు రాణిగారు’ సినిమాతో వీరు ఇద్దరూ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. కిరణ్‌-రహస్యలకు ఆ సినిమా నుంచే మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పట్నుంచి ఫ్రెండ్షిప్‌ను మెయింటైన్‌ చేస్తున్నారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ముందుకెళ్లి.. ప్రేమగా మారిందా..? అనే విషయంపై వారే క్లారిటీ ఇవ్వాలి. ఇక సినిమాల సినిమాల పరంగా కిరణ్‌ అబ్బవరం రేసు గుర్రంలా పరిగెడుతుంటే,  రహస్య కెరీర్‌ మాత్రం కాస్త డల్‌గానే సాగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..