ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ కిర్రాక్ ఆర్పీ ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో రెస్టారెంట్లు ఓపెన్ చేశాడు. కూకట్ పల్లిలో మొదటి బ్రాంచ్ ఓపెన్ చేసిన ఆర్పీ రద్దీ ఎక్కువ కావడంతో కొన్ని రోజుల పాటు మూసేశాడు. అయితే నెల్లూరు నుంచి మరికొంతమంది మనుషులను తీసుకొచ్చి పకడ్బందీగా చేపల పులుసు సెంటర్‌ను ఓపెన్ చేశాడు. ఆర్పీకీ ఉన్న ఫేమ్‌తో పాటు మీడియా విపరీతమైన ఫోకస్ చేయడంతో అతని వ్యాపారం బాగా సాగింది. లాభాలు కూడా బాగానే వచ్చాయి. దీంతో వెంటనే మణికొండలో రెండో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఆపై నిత్యం విద్యార్థులు, ఉద్యోగులతో కిటకిటలాడే అమీర్‌పేటలో ముచ్చటగా మూడో బ్రాంచ్‌ను ఓపెన్ చేశాడు. అంతేకాదు ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్‌కి ఏదో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి తన ఫుడ్ బిజినెస్‌కు మంచిగా ప్రమోట్ చేసుకున్నాడు. తాజాగా ఏపీకి వెళ్లిపోయాడు ఆర్పీ. అనంతపురంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నాలుగో బ్రాంచ్‌ను ఓపెన్ చేశాడు.
ఓపెనింగ్ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ యువనేత, శాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. రిబ్బన్ కట్ చేసి చేపల పులుసు సెంటర్‌ను ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కేజీ కొరమీను పులుసు ఏకంగా రూ.1800, ఉండగా, బొమ్మిడాయిల పులుసు కూడా అదే ధర ఉంటోంది.ఇక రవ్వ చేపలు, సన్న చేపలు, పప్పు చారు ఉప్పు చాప వంటి వెరైటీలు టేస్ట్ చేయాలంటే కూడా 1200 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఎంత రుచిగా ఉన్నా ఇంతలా రేట్లు భరించలేమని జనాలు అంటున్నారు. మరి ఆర్పీఈ రేట్లను తగ్గిస్తాడా? లేదా? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..