Bigg Boss: బిగ్ బాస్ హోస్ట్‌గా కిచ్చా సుదీప్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా? వామ్మో అన్ని కోట్లా?

|

Dec 17, 2024 | 6:23 PM

'బిగ్ బాస్ కన్నడ సీజన్ 11' మధ్యలో 'కిచ్చ' సుదీప్ షాకింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సీజన్ తర్వాత షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆయన బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం కూడా ఇచ్చారు. ఈ వార్త బిగ్ బాస్ తో పాటు సుదీప్ అభిమానులను నిరాశకు గురి చేసింది

Bigg Boss: బిగ్ బాస్ హోస్ట్‌గా కిచ్చా సుదీప్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా? వామ్మో అన్ని కోట్లా?
Kichcha Sudeep
Follow us on

‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ మధ్యలో ‘కిచ్చ’ సుదీప్ షాకింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సీజన్ తర్వాత షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆయన బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం కూడా ఇచ్చారు. ఈ వార్త బిగ్ బాస్ తో పాటు సుదీప్ అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా సుదీప్‌కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. హౌస్ లోని కంటెస్టెంట్‌లను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు అందుకే ప్రతి సీజన్‌లోనూ తనే స్వయంగా వండి ఇంటి నుంచి కంటెస్టెంట్స్‌కి భోజనం పంపిస్తున్నాడు. ఇది బిగ్‌బాస్‌ రియాలిటీ షో పై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తోంది. ఇక సుదీప్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ముందు కేవలం ఐదు సీజన్ల వరకే ఒప్పందం కుదుర్చుకున్నాడట ఈ స్టార్ హీరో. ఈ ఐదు సీజన్లకు గాను 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అంటే ఒక్కో సీజ‌న్‌కి నాలుగు కోట్ల రూపాయ‌లు అన్నమాట. కాగా బిగ్ బాస్ కన్నడ సీజన్ 11′ కోసం సుదీప్ రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సుదీప్ కానీ, కలర్స్ ఛానెల్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభానికి ముందే సుదీప్ తప్పుకుంటున్నాడని ప్రచారం జరిగింది. కాంతారా హీరో రిషబ్ శెట్టి హోస్ట్ గా బాధ్యతలు తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. ఇప్పటివరకు బిగ్ బాస్ 10 సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన సుదీప్ కూడా 11వ సీజన్ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే సీజన్ నుంచి తప్పుకున్నాడు. సుదీప్ క్రేజ్ వల్లే బిగ్ బాస్ కన్నడ టీఆర్పీ పెరిగిందన్న భావన అభిమానుల్లో ఉంది. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో బిగ్ బాస్ షో ఛరిష్మా తగ్గుతుందంటున్నారు ఆడియెన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.