“మ‌ళ్లీ‌ ముఖానికి మేక‌ప్ వేసుకోవ‌డం ఆనందంగా ఉంది”

|

Jul 20, 2020 | 4:18 PM

కన్నడ స్టార్ హీరో సుదీప్‌ కిచ్చ మళ్లీ మేక‌ప్ వేసుకుని కెమెరా ముందుకు వ‌చ్చారు. లాక్‌డౌన్ వ‌ల‌న‌ నిలిచిపోయిన 'ఫాంటమ్‌' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం పునఃప్రారంభ‌మైంది.

మ‌ళ్లీ‌ ముఖానికి మేక‌ప్ వేసుకోవ‌డం ఆనందంగా ఉంది
Follow us on

కన్నడ స్టార్ హీరో సుదీప్‌ కిచ్చ మళ్లీ మేక‌ప్ వేసుకుని కెమెరా ముందుకు వ‌చ్చారు. లాక్‌డౌన్ వ‌ల‌న‌ నిలిచిపోయిన ‘ఫాంటమ్‌’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం పునఃప్రారంభ‌మైంది. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆయన ఫ్యాన్స్ తో ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘ఈ రోజు నా ముఖానికి మేక‌ప్ వేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది.’ అంటూ పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న వీడియోను సుదీప్ షేర్ చేశారు.

సుదీప్ ‘ఈగ’, ‘బాహుబలి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. చివ‌రిసారిగా తెలుగులో ఆయ‌న‌ మెగాస్టార్​ చిరంజీవితో సైరాలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్​లో సల్మాన్​తో ‘దబాంగ్​ 3లోనూ సంద‌డి చేశారు. తాజాగా అందుతోన్న స‌మాచారం మేర‌కు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​లోనూ ఓ కీల‌క పాత్ర కోసం సుదీప్ ను ఎంపిక చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుదీప్‌ పోలీసు ఆఫీస‌ర్ గా కనిపించబోతున్నారని సమాచారం.