Kiara Advani : అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోన్న చిన్నది

|

Oct 30, 2022 | 5:05 PM

ఇప్పటికే చాలా మంది తెలుగు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి అందాల భామ కియారా అద్వానీ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారాలనీ ప్రయత్నిస్తోంది

Kiara Advani : అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోన్న చిన్నది
Kiara Advani
Follow us on

బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్ లో రాణించడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు దేశాన్నే ఊపేస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ భామలు టాలీవుడ్ లో నటించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి అందాల భామ కియారా అద్వానీ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారాలనీ ప్రయత్నిస్తోంది. ఆ మధ్య మహేష్ బాబు నటించిన భారత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కియారా అద్వానీ. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.  దాంతో వెంటనే బోయపాటి సినిమాలో అవకాశం అందుకుంది. బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది కియారా . ఈ సినిమా ఉంహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో తిరిగి బాలీవుడ్ నే నమ్ముకుంది.

అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగు సినిమాల్లో రాణించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తోంది రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పొలిటికల్ నేపధ్యంలో ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. అలాగే తెలుగులో మరికొన్ని సినిమాలు కూడా చేయనుందని తెలుస్తోంది.  ఇక బాలీవుడ్ లో  ‘భూల్ భాలైయ్యా-2’ మంచి విజయం అందుకుంది. మరో సినిమా ‘జగ్ జగ్ జియో’ యావరేజ్ గా ఆడింది. ఇంకా అమ్మడులైన్ లో పెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో  అశోతోష్ గోవారికర్ తో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి కమిట్ అయింది. ఇలా అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను హ్యాండిల్ చేస్తోంది కియారా.

ఇవి కూడా చదవండి