7వ నెల గర్భంతో సినిమా షూటింగ్‌కు వెళ్లి రిస్క్​ తీసుకున్న స్టార్ హీరోయిన్! ఎవరో తెలుసా?

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్లుగా రాణించడం అంటే మాములు విషయం కాదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా లీడ్​ చేస్తున్న నటీమణులు ఈ మధ్యకాలంలో చాలామంది కనిపిస్తున్నారు. అయితే, ఒక స్టార్ హీరోయిన్ మాత్రం తన గర్భధారణ సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా కెమెరా ..

7వ నెల గర్భంతో సినిమా షూటింగ్‌కు వెళ్లి రిస్క్​ తీసుకున్న స్టార్ హీరోయిన్! ఎవరో తెలుసా?

Updated on: Dec 25, 2025 | 8:30 AM

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్లుగా రాణించడం అంటే మాములు విషయం కాదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా లీడ్​ చేస్తున్న నటీమణులు ఈ మధ్యకాలంలో చాలామంది కనిపిస్తున్నారు. అయితే, ఒక స్టార్ హీరోయిన్ మాత్రం తన గర్భధారణ సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గర్భిణీలు ఐదు లేదా ఆరో నెల రాగానే షూటింగ్​లకు విరామం ఇచ్చి ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఈ భామ మాత్రం ఏకంగా ఏడో నెల గర్భంతో ఉన్నప్పుడు కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు, షూటింగ్ షెడ్యూల్స్​లో పాల్గొందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ధైర్యవంతురాలైన ‘స్టార్ బ్యూటీ’ ఎవరు?

ఆ స్టార్​ బ్యూటీ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే తల్లి కాబోతున్నట్లు తెలిసింది. అయితే అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ఆమె నిర్ణయించుకుంది. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే అలసట, నీరసాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా సెట్స్​కు హాజరై తన పాత్రకు న్యాయం చేసింది. ఆ సమయంలో ఆమె పడిన కష్టం, సెట్స్​లో ఉన్న సభ్యులు ఆమెకు ఇచ్చిన సహకారం గురించి ఆమె ఎంతో ఎమోషనల్​గా వివరించింది. “మహిళలు ఏ రంగంలో ఉన్నా సరే, వారిలోని మాతృత్వం వారి వృత్తికి అడ్డంకి కాకూడదు” అని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది.

ఏడో నెలలో షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆమె కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారని, తన కడుపు కనిపించకుండా ఉండేలా కెమెరా యాంగిల్స్ మార్చడం లేదా లూజ్ కాస్ట్యూమ్స్ వాడటం వంటివి చేశారని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో తన ఆరోగ్యం గురించి ఇంట్లో వారు కంగారు పడినా, తన వృత్తిపై ఉన్న గౌరవంతో షూటింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపింది. ఆమె చూపిస్తున్న ఈ డెడికేషన్ చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Kiara Advanii

ఇంతలా తన పని పట్ల అంకితభావం చూపిన ఆ నటి మరెవరో కాదు.. గ్లోబల్ బ్యూటీ కియారా అద్వానీ! సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న తర్వాత కియారా తన వ్యక్తిగత మరియు వృత్తిగత జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్ చేస్తోంది. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో జరిగిన షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ.. తాను ఏడో నెలలో కూడా షూటింగ్​లో పాల్గొన్నానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ధైర్యాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, దాని వెనుక నటీనటుల ఎంతో కష్టం ఉంటుందని కియారా అద్వానీ మాటలు వింటే అర్థమవుతోంది. తల్లిగా మారుతున్న ఆ మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తూనే, తన వృత్తి బాధ్యతలను నెరవేర్చడం నిజంగా అభినందనీయం. ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.