AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: రవితేజ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ సతీమణి.. చీప్‌ యాక్టర్‌ అంటూ..

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి నుంచి రవితేజ వివాదాలను దూరంగా ఉంటూ వచ్చారు.

Ravi Teja: రవితేజ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ సతీమణి.. చీప్‌ యాక్టర్‌ అంటూ..
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2022 | 11:54 AM

Share

Ravi Teja: హీరో, డైరెక్టర్ మధ్య ఎక్కడ చెడింది? డైరెక్టర్ టాలెంట్‌పై హీరోకి నమ్మకం లేదా? హీరో క్యారెక్టర్ డైరెక్టర్‌కు నచ్చడం లేదా? ఇద్దరు కలిసి సినిమా తీశారు. అంతా అయ్యాక ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇంతకు ఏంజరిగిందంటే.. ఖిలాడి. మాస్ మహారాజా రవితేజకు చాలా రోజుల తర్వాత విడుదలైన సినిమా. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. డైరెక్టర్ రమేశ్ వర్మ వైఫ్ రేఖా వర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఇప్పటికే ఉన్న కాంట్రవర్సికి మరింత ఆజ్యం పోసింది. గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్‌ యాక్టర్‌ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు రేఖవర్మ. దీనిపై రవితేజ ఫ్యాన్స్ అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. అయితే రవితేజ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

కాస్తా ఇన్‌ డీటేల్డ్‌గా వెళ్తే.. రవితేజ హీరోగా, రమేశ్ వర్మ డైరెక్షన్‌లో, సత్యనారాయణ నిర్మాణంలో వచ్చిందే ఖిలాడీ సినిమా. ఏం జరిగిందో తెలియదు, డైరెక్టర్, హీరోకు ఇక్కడ తేడా వచ్చిందో తెలియదు కాని, నిర్మాత గారు.. మీరు ఇంకొంచెం దగ్గరుండి చూసుకోవాల్సింది అంటూ ఇన్‌డైరెక్ట్ కామెంట్ చేశారు రవితేజ. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనే డైరెక్టర్‌ కడుపులో మంట పుట్టించాడు. అతని టాలెంట్‌ గురించి ఒక్క పొగడ్త కూడా అందుకోని మాస్‌ మహారాజా ప్రొడ్యూసర్‌కు సూచనలు చేయడానికి పరిమితమ్యాడు. జాతకం, అదృష్టాన్ని తాను నమ్మను. కేవలం టాలెంట్‌ను నమ్ముకుంటాను. ఇదీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ బిగ్ డైలాగ్. రమేశ్ వర్మ జాతకం ఓ శాతం పెంచాల్సిన అవసరం ఉందంటూ చెప్పడం షాక్‌కు గురిచేసింది. నాటి డైలాగ్‌లకు తోడు, నేటి ఇన్‌స్టా పోస్టింగ్.. కాంట్రవర్సీని మరింత పెంచింది. ఇన్ని రోజుల పాటు సినిమా చేసి, ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకువచ్చాక.. కాంట్రవర్సి డైలాగ్స్ రచ్చ చేస్తున్నాయి. అయితే రవితేజ.. అనుకున్న విధంగా సినిమా రాలేదా? లేదంటే సెట్‌లో ఏమైన జరిగిందా అన్నది తేలాల్సి ఉంది.

Untitled 1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..

Follow Us