AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2 Day 5 Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న కేజీఎఫ్ 2 వసూళ్లు.. దంగల్ రికార్డుపై కన్నేసిన రాఖీ భాయ్..

యష్(Yash) హీరోగా గతవారం విడుదలైన కేజీఎఫ్ 2(KGF 2) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకపోతోంది. ఈ మేరకు బాలీవుడ్ ఏ-లిస్ట్ నటుల సినిమాల రికార్డులను తారుమారు చేస్తే కాసుల వర్షం కురిపిస్తోంది.

KGF 2 Day 5 Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న కేజీఎఫ్ 2 వసూళ్లు.. దంగల్ రికార్డుపై కన్నేసిన రాఖీ భాయ్..
Kgf 2 Collection
Venkata Chari
|

Updated on: Apr 19, 2022 | 3:53 PM

Share

యశ్(Yash) హీరోగా గతవారం విడుదలైన కేజీఎఫ్ 2(KGF 2) సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ ఏ-లిస్ట్ నటుల సినిమాల రికార్డులను తారుమారు చేస్తే కాసుల వర్షం కురిపిస్తోంది. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ 5 రోజుల్లో రూ. 219.56 కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమా వసూళ్ల గణాంకాలను పంచుకున్నారు. కేజీఎఫ్ 2ను ఆపడం అసాధ్యమని ఆకాశానికెత్తారు. ఈ సినిమా వర్కింగ్ డేస్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. మొదటి వారంలో ఈ సినిమా రూ. 270 కోట్లు వసూలు చేయగలదని పేర్కొన్నారు. ఈ సినిమా జోరు ఇలాగే కొనసాగితే అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్'(dangal) రికార్డులను బీట్ చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కలెక్షన్లను ఓసారి గమనిస్తే.. నైజాంలో రూ. 2.46 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ.74 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.52 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ. 19 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 23 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 26 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా 5వ రోజున కేజీఎఫ్ 2 సినిమా రూ. 5.10 కోట్ల షేర్, రూ. 8.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

KGF 2 ప్రపంచవ్యాప్త కలెక్షన్స్..

యశ్ నటించిన KGF 2 భారతదేశంలో గురువారం రూ. 53.95 కోట్లు, శుక్రవారం రూ. 46.79 కోట్లు, శనివారం రూ. 42.90 కోట్లు, ఆదివారం రూ. 50.35 కోట్లు, సోమవారం రూ.25.57 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో రూ.219.56 కోట్ల మార్కును దాటింది. అలాగే ప్రపంచ మార్కెట్‌లోనూ ఇదే ప్రభంజనం కనిపిస్తోంది. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా KGF Chapter 2 మొత్తం 5 రోజుల కలెక్షన్లను ఓసారి చూద్దాం.. కర్ణాటకలో రూ.100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 93 కోట్లు, కేరళలో 33.75 కోట్లు, తమిళనాడులో రూ. 36.25 కోట్లు, హిందీతోపాటు ఇతర రాష్టాల్లో కలిపి రూ. 256 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 104 కోట్లు రాబట్టింది. ఈమేరకు మొత్తంగా రూ. 623.80 కోట్ల గ్రాస్‌ను, రూ. 311.15 కోట్ల షేర్‌ను నమోదు చేసి, దూసుకెళ్తోంది.

KGF చాప్టర్ 1 కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వసూళ్ల పరంగా కేజీఎఫ్  మొదటి భాగాన్ని మించి వసూళ్లు రాబడుతోంది. రాకీ భాయ్ స్టామినా, స్వాగ్‌ని ప్రజలు ఇష్టపడుతున్నారు. KGF 2 లో యశ్‌తో పాటు రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..