Srinidhi Shetty: కోబ్రా మూవీ కోసం శ్రీనిధి అంత తీసుకుందా ?.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కేజీఎఫ్ బ్యూటీ రెమ్యునరేషన్..

|

Jul 13, 2022 | 1:26 PM

కోబ్రా సినిమా కోసం శ్రీనిధి భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమా కోసం శ్రీనిధి కేజీఎఫ్ కంటే రెండింతలు ఎక్కువగా తీసుకుందట.

Srinidhi Shetty: కోబ్రా మూవీ కోసం శ్రీనిధి అంత తీసుకుందా ?.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కేజీఎఫ్ బ్యూటీ రెమ్యునరేషన్..
Srinidhi
Follow us on

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 సృష్టించిన సంచలనం తెలిసిందే. భారీగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కన్నడ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించగా.. అతని ప్రియురాలిగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి కనిపించింది. ఈ సూపర్ హిట్ సినిమాతో శ్రీనిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు కోబ్రా సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో విక్రమ్ చియాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీనిధి రెమ్యునరేషన్ టాక్ హాట్ టాపిక్‏గా మారింది.

కోబ్రా సినిమా కోసం శ్రీనిధి భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమా కోసం శ్రీనిధి కేజీఎఫ్ కంటే రెండింతలు ఎక్కువగా తీసుకుందట. కేజీఎఫ్ సినిమాలో నటించినందుకు ఆమె రూ. 3 కోట్లు తీసుకుందట. ఇక ఇప్పుడు కోబ్రా మూవీ కోసం ఏకంగా ఆరు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.