AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త జంటకు వెల్ కమ్ చెప్పిన రణబాలి మేకర్స్.. సెట్‌లో కేక్ కట్ చేసిన విజయ్, రష్మిక

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది బంధువుల మధ్య వీరి వివాహం జరిగింది. అనంతరం హైదరాబాద్ లో వీరి పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.

కొత్త జంటకు వెల్ కమ్ చెప్పిన రణబాలి మేకర్స్.. సెట్‌లో కేక్ కట్ చేసిన విజయ్, రష్మిక
Vijaydevarakonda
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2026 | 8:18 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ “రణబాలి”. ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవలే విజయ్, రశ్మిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ కొత్త జంట “రణబాలి” సెట్ లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విజయ్, రశ్మికకు చిత్ర యూనిట్ వెల్ కమ్ చెబుతూ సెలబ్రేషన్స్ జరిపారు. కేక్ కట్ చేయించి, హ్యూపీ మ్యారీడ్ లైఫ్ మిస్టర్ అండ్ మిసెస్ రణబాలి అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్‌.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది.

ఇవి కూడా చదవండి

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్ రష్మిక పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. వీరి రిసెప్షన్ మార్చ్ 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు.

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us