Actress: డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిన హీరోయిన్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

|

Mar 23, 2023 | 3:24 PM

రిస్క్‌ అని తెలిసినా.. ఈ వ్యసనానికి దాసోహం అంటారు. అలా అని.. లైట్‌ తీసుకుని.. ఎప్పుడోప్పుడు అడ్డంగా బుక్కవుతారు. పోలీసులకు చిక్కుతారు. ఇప్పుడో హీరోయిన్ ఇలాగే చిక్కారు.

Actress: డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిన హీరోయిన్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Malayalam Actress
Follow us on

కొంత మంది సెలబ్రిటీలంతే.. ఎప్పుడూ నిషాలోనే ఉంటారు. ఎప్పుడూ నిషాలోనే ఉండాలనుకుంటారు. అందుకే డబుల్ కిక్కిచ్చే డ్రగ్స్‌ను వాడుతుంటారు. రిస్క్‌ అని తెలిసినా.. ఈ వ్యసనానికి దాసోహం అంటారు. అలా అని.. లైట్‌ తీసుకుని.. ఎప్పుడోప్పుడు అడ్డంగా బుక్కవుతారు. పోలీసులకు చిక్కుతారు. ఇప్పుడో హీరోయిన్ ఇలాగే చిక్కారు. అంజు కృష్ణ! థియేటర్ ఆర్టిస్టుగా తన యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈమె.. సినిమాల్లో హీరోయిగా నటించడమే గోల్ గా పెట్టుకున్నారు. అందుకోసం విపరీతంగా శ్రమించారు.

శ్రమించడమే కాదు చిన్నా చితగా సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ స్టార్ హీరోన్‌గా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. మలయాళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా వచ్చేసి.. డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఇక ఈ కమ్రంలోనే బెంగుళూరులోని తన అపార్ట్‌ మెంట్లో తాజాగా డ్రగ్స్‌తో దొరికారు.. మళ్లీ అంతటా సెన్సేషన్‌గా మారిపోయారు.

రీసెంట్ గా తనకు పరిచయమైన షామీర్‌ సాయంతో.. బెంగుళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి.. కొచ్చిలో విక్రమయిస్తూ పట్టుబడ్డారు అంజు కృష్ణ. పోలీసులు నిలదీయడంతో.. ఏడుపందుకున్నారు. సినిమాలు లేక సంపాదన కోసం ఇలా చేస్తున్నా అన్నారు. అయితే ఈ మాటలు నమ్మని పోలీసులు అంజుని ..ఆమె ఫ్రెండ్ షామీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసే నమోదు చేసుకుని విచారిస్తున్నారు.