సినీ నటి వేధింపుల ఆరోపణలు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ!

పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై ఓ మలయాళం నటి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు వరుసగా పలువురు మహిళలు వేధింపుల ఆరోపణలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఆగస్ట్ 25) పార్టీ అతనిపై చర్యలు చేపట్టింది..

సినీ నటి వేధింపుల ఆరోపణలు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ!
Palakkad Mla Rahul Mamkootathil

Updated on: Aug 25, 2025 | 12:22 PM

కేరళ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై ఓ మలయాళం నటి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు వరుసగా పలువురు మహిళలు వేధింపుల ఆరోపణలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఆగస్ట్ 25) పార్టీ అతనిపై చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే రాహుల్‌ మామకుటత్తిల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతారు. పార్టీ లోపల, వెలుపల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా కేరళ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మమ్‌కూటథిల్‌ రాజీనామా చేసిన కొన్ని రోజులకే తాజా పరిణామం చోటు చేసుకుంది.

గత వారం ప్రముఖ మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్.. మూడేళ్లుగా ఓ ఎమ్మెల్యే తనకు పదే పదే అభ్యంతరకరమైన సందేశాలు పంపారని, తనను ఓ హోటల్‌కు కూడా పిలిచినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. దీనిపై పలుమార్లు ఆ పార్టీ సీనియర్ల దృష్టికితీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. నేతల పేరును ఆమె నేరుగా ప్రస్తావించనప్పటికీ.. పాలక్కాడ్‌లోని మామ్‌కూటథిల్ కార్యాలయం వెలుపల బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నటి ఆరోపించిన ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌ అని వెల్లడించింది. మరోవైపు సీపీఐ(ఎం) యువజన విభాగం డీవైఎఫ్‌ఐ కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో రచయిత్రి హనీ భాస్కరన్ ఒక్కసారిగా బయటకు వచ్చి.. బహిరంగంగా మమ్‌కూటథిల్ పేరును ప్రస్తావించారు. తనకు కూడా ఎమ్మెల్యే అవాంచిత సందేశాలు పంపుతున్నాడని ఆరోపించింది. యూత్ కాంగ్రెస్‌లో అతనిపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయని, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె పేర్కొంది.

అవంతిక అనే ట్రాన్స్ మహిళ అవంతిక కూడా మమ్‌కూటథిల్ తనకు అత్యాచారం బెదిరింపుల సందేశాలు పంపినట్లు ఆరోపించింది. తొలుత స్నేహం నటించి, ఆపై తన వక్రబుద్ధి చూపాడని తెలిపింది. దీంతో రోడ్డెక్కిన బీజేపీ, సీపీఎం శ్రేణులు ఈ ఆరోపణలపై ఆయన ప్రమేయం ఉందని ఆరోపించాయి. వెంటనే ఎమ్మెల్యే మమ్‌కూటథిల్ రాజీనామా చేయాలని నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా అనంతరం కూడా విమర్శలు ఆగకపోవడంతో ఏకంగా అధీష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.