Honey Rose: హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. ‘బంగారం’ బాబీ దొరికేశాడు.. వయనాడ్‌లో అరెస్ట్

|

Jan 08, 2025 | 12:48 PM

ప్రముఖ నటి హనీరోజ్ పై వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇ ప్పటికే ఈ వ్యవహారంలో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Honey Rose: హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. బంగారం బాబీ దొరికేశాడు.. వయనాడ్‌లో అరెస్ట్
Honey Rose
Follow us on

ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్‌ ఫిర్యాదు మేరకు ప్రముఖ వ్యాపార వేత్త బాబీ చెమ్మన్నూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్‌లో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నాడంటూ బాబీ చెమ్మన్నూర్‌పై హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే పోలీసులు బాబీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొచ్చి నుంచి వయనాడ్ వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతనిని అదుపులోకి తీసుకుంది. తదుపరి విచారణ కోసం బాబీ చెమ్మన్నూర్‌ను కొచ్చికి తీసుకెళ్లనున్నారు. గత కొంత కాలంగా కొందరు తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నట్లు హనీ రోజ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాంటి వారిపై చట్టపరంగా పోరాడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఇప్పుడు హనీ రోజ్ ఆరోపణలతో మరోసారి లైంగిక వేధింపులు వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే బాబీ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను నటిని ఉద్దేశించలేదని, హనీరోజ్ తన మాటలను తప్పుగా అర్థం చేసుకుందన్నాడు.

 

ఇవి కూడా చదవండి

భారతదేశంలోని ప్రముఖ బంగారు వ్యాపారులలో బాబీ చెమనూరు ఒకరు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకొచ్చి తన జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రముఖ వ్యాపారినే హనీ రోజ్ పై అసభ్యకర కామెంట్స్ చేసి వార్తల్లో కెక్కాడు.

వయనాడ్ లో అరెస్ట్..

కాగా 2005 నుంచి సినిమాల్లో నటిస్తోంది హనీ రోజ్. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీగా ఫాలోయింగ్ ఉంది. సినిమాల కంటే ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోల ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఇదే క్రమంలో ఆమెపై సోషల్ మీడియా వేదికగా లైంగిక వేధింపులు మొదలయ్యాయి. కొందరు హనీ రోజ్ పై బాడీ షేమింగ్ కామెంట్స్, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల, ఒక ప్రముఖ వ్యాపారవేత్త హనీ రోజ్ పై మరీ అభ్యంతకరకంగా కామెంట్స్ చేశాడు. దీంతో నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Source)

హనీ రోజ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.