
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో దివంగత హీరోయిన్ సావిత్రి పాత్రలో నటించిన కీర్తి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే సౌత్ నుంచి నార్త్ లోకి చాలా మంది ముద్దుగుమ్మలు అడుగుపెట్టారు. అక్కడ స్టార్ హీరోయిన్గా కొనసాగాలని అనుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. మరికొందరు ఒకటి రెండు చిత్రాలతో వెనక్కు వచ్చేస్తుంటారు. ఇదివరకే ఇలియానా, శ్రుతిహాసన్, తాప్సీ, రష్మిక మందన్నా, పూజా హెగ్డే బీటౌన్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఇక ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన రష్మిక కేవలం మూడు చిత్రాలతో సరిపెట్టుకుంది. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కీర్తికి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయని సమాచారం. ఈ క్రమంలోనే కీర్తి ఓ కథను ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ జోడిగా కీర్తి నటించనుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇప్పుడు ఈ విషయం నిజమే అంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో కీర్తి ముంబైలో రోడ్లపై ఆటోలో ప్రయాణిస్తోంది. ఆమె పక్కనే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ఉండడం విశేషం.
Keerthy Suresh & Varun Dhawan.
— Christopher Kanagaraj (@Chrissuccess) September 23, 2023
దీంతో వరుణ్ జోడిగా కీర్తి నటిస్తోందని ఈ వీడియో చూస్తే అర్థమైంది. మాస్ యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని.. దీనికి కోలీవుడ్ డైరెక్టర్ కాలీస్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఇప్పటివరకు దక్షిణాదిలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన కీర్తి.. ఇప్పుడు నార్త్ లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కీర్తి చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో కనిపించింది. ఇందులో చిరు చెల్లిగా నటించింది.