Keerthy Suresh First Remuneration: మయాళ చిత్రంతో నటిగా కెరీర్ మొదలుపెట్టారు నటి కీర్తి సురేశ్. తండ్రి నటన వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారీ ముద్దుగుమ్మ. అనతికాలంలో విజయవంతమైన చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేశారు కీర్తి. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఇక్కడి ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేసింది. ఇక మహానటి సినిమాతో కీర్తి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాలో అచ్చంగా సావిత్రిలా కనిపించి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాకు కీర్తి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకొని.. ప్రస్తుతం రూ. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న కీర్తి సురేశ్ తొలి సంపాదన కేవలం రూ. 500 అనే విషయం మీకు తెలుసా? తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపారు. అయితే కీర్తి సురేశ్ బాల నటిగా నటించినప్పుడు.. నిర్మాతలు తనకు డబ్బుల కవర్ ఇచ్చేవారట.. దాన్ని తాను తీసుకొని నేరుగా తన తండ్రికి ఇచ్చేవారట. దీంతో అందులో ఎంత డబ్బు ఉండేదో కీర్తికి తెలిసేది కాదని చెప్పుకొచ్చారు. కానీ ఓసారి కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసినందుకు గాను రూ. 500 ఇచ్చారంట..దీంతో ఆ డబ్బును కీర్తి నేరుగా అందుకున్నారు. ఈ కారణంగానే తన ఊహ తెలిసిన మొదటి సంపాదన ఈ రూ. 500 అనే చెప్పుకొచ్చారు కీర్తి సురేశ్. అందుకే బాల నటిగా వచ్చిన రెమ్యునరేషన్ కాకుండా రూ.500 తన తొలి సంపాదనగా భావిస్తున్నట్లు కీర్తి తెలిపారు. అయితే ఆ డబ్బును కూడా కీర్తి తన పాకెట్ మనీ కోసం వాడుకోకుండా తన తండ్రికే ఇచ్చేశారంట. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ చివరిగా తెలుగులో నితిన్ హీరోగా నటించిన రంగ్‌దే సినిమాలో నటించారు. ఇక ఈ చిన్నది ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న అన్నాత్తే చిత్రంతో పాటు.. మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.
Also Read: కరోనా పోరులో మేము సైతం అంటున్న టాలీవుడ్ హీరోలు.. ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్న తారలు..
Mamata Banerjee: బెంగాల్ ముఖ్యమంత్రి పదవికీ మమతా బెనర్జీ రాజీనామా..