దక్షిణాది సూపర్ హిట్ చిత్రాలతో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి.. మహానటి సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ జోడిగా బేబీ జాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది కీర్తి. ఇక పెళ్లైన మూడు రోజులకే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. కానీ బేబీ జాన్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అలాగే ఈసినిమాకు అంతగా వసూళ్లు సైతం రావడం లేదు. ఇదిలా ఉంటే.. బేబీ జాన్ సినిమా కోసం నిత్యం ముంబైలో సందడి చేస్తుంది కీర్తి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి అక్కడి ఫోటోగ్రాఫర్స్ ఆమెను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు ఫోటోగ్రాఫర్స్ ఆమెను కృతి అని పిలిచారు. దీంతో నాపేరు కృతి కాదు.. కీర్తి అని చెప్పింది. అలాగే కీర్తి దోస అని పిలవడం పై అభ్యంతరం చెప్పింది కీర్తి. నాపేరు కీర్తి దోస కాదు.. కీర్తి సురేష్.. నాకు దోస అంటే చాలా ఇష్టమని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
బేబీ జాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు డైరెక్టర్ అట్లీ నిర్మించారు. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిక గబ్బి ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో జాకీ ష్రాఫ్ విలన్ గా నటించగా.. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.