Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన మహేష్ హీరోయిన్.. మరోసారి ఆ స్టార్ హీరోతో నటించనున్న కీర్తి సురేష్

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో వరుసగా అవకాశాలు లు దక్కించుకుంటుంది  ఈ చిన్నది.

Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన మహేష్ హీరోయిన్.. మరోసారి ఆ స్టార్ హీరోతో నటించనున్న కీర్తి సురేష్
Keerthy Suresh

Updated on: May 26, 2021 | 7:13 PM

Keerthy Suresh

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో వరుసగా అవకాశాలు లు దక్కించుకుంటుంది  ఈ చిన్నది. తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులో స్థానం సంపాదించుకుంది కీర్తి. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో మహానటి సినిమాతో తనలోని నటన ప్రతిభను చూప్పించి జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ద్వారా మొదటి సారి కీర్తి మహేష్ బాబుతో జతకడుతుంది. పరుశురామ్  ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉండనుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ దక్కించుకుందని తెలుస్తుంది.

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ సరసన మరోసారి కీర్తి సురేష్ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. గతంలో విజయ్ కు జోడీగా సర్కార్ సినిమాలో నటించింది కీర్తి. ఇప్పుడు మరోసారి విజయ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. ఈ విషయంలో చిత్రయూనిట్ కీర్తితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: టాలీవుడ్ లో మహేష్ ఒక్కడే సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు…

యంగ్ హీరో బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న చిత్రయూనిట్.. స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న 18 పేజెస్ టీమ్…

Radhe Movie : సల్మాన్ రాధే మూవీ సరికొత్త రికార్డు.. 65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సినిమా..

 

Loading...
Unable to load recommendations.
Follow Us