Keerthy Suresh : కీర్తి సురేష్ ఇంటిని చూశారా.. ? భర్తతో కలిసి మహానటి హోంటూర్.. ఆ ఒక్కటి చాాలా స్పెషల్..

కీర్తి సురేష్.. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. కానీ ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వెళ్లింది. ఆ సినిమా నిరాశ పరిచింది. ఇప్పుడు మరిన్ని అవకాశాలు అందుకుంటూ హిందీ సినిమా పరిశ్రమలో బిజీగా మారింది.

Keerthy Suresh : కీర్తి సురేష్ ఇంటిని చూశారా.. ? భర్తతో కలిసి మహానటి హోంటూర్.. ఆ ఒక్కటి చాాలా స్పెషల్..
Keerthy Suresh

Updated on: Jan 24, 2026 | 8:10 AM

దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మలయాళంలో గీతాంజలి సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దాదాపు 15 ఏళ్ల తన రిలేషన్ షిప్ ను ఒక్క మాటలో తేల్చేసింది. 12వ తరగతిలో మొదలైన ప్రేమకథను ఇప్పుడు వైవాహిక బంధంగా మార్చేసింది. తన ప్రియుడు ఆంటోని తటిల్ ను కీర్తి 2024లో వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయల ప్రకారం జరిగింది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉంది కీర్తి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరించింది. తాజాగా తమ ఇంటిని అభిమానులకు చూపించింది కీర్తి. భర్తతో కలిసి హోమ్ టూర్ చేసిన వీడియోను షేర్ చేసింది. కొచ్చిలో తాము నివాసముంటున్న ఇంటిని చూపించింది. తమ భవనానికి హౌస్ ఆఫ్ ఫన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. అలాగే ఆ ఇంట్లో తన ఫ్యామిలీ ఫోటోస్, పెళ్లి ఫోటోస్, మహానటి సినిమాగానూ తనకు వచ్చిన జాతీయ అవార్డు.. అదే సమయంలో తనపై వచ్చిన వార్తల కథనాల క్లిప్పింగ్స్ సైతం కీర్తి చూపించింది.

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..

తన సినీప్రయాణం.. అందమైన జ్ఞాపకాలు, అనుభవాలను ఒక్కచోట చేర్చుతూ మెమొరీ వాల్ సిద్ధం చేసుకుంది. ఈ మెమొరీ వాల్ కీర్తి సురేష్ ఇంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తన పెంపుడు కుక్కలు నైక్, కెన్నీ కోసం స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసింది. సాంప్రదాయాన్న మోడ్రన్ మిక్స్ చేసేలా ఇంటీరియర్ డిజైన్ చేసింది. బాల్కనీ మొత్తం మొక్కలతో అందంగా డెకరేట్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ హోంటూర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..