Devi Sri Prasad :ఈ పాటను ఆయనకే అంకితం ఇస్తున్నాం.. సిరివెన్నెల పై ప్రేమ చాటుకున్న దేవి శ్రీ..

|

Dec 03, 2021 | 8:13 AM

అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో గడిపేస్తుంది ఈ బ్యూటీ.

Devi Sri Prasad :ఈ పాటను ఆయనకే అంకితం ఇస్తున్నాం.. సిరివెన్నెల పై ప్రేమ చాటుకున్న దేవి శ్రీ..
Sakhi
Follow us on

Keerthy Suresh: అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో గడిపేస్తుంది ఈ బ్యూటీ. రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లింది ఈ చిన్నది. ఆతర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది కీర్తి. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి జీవించిందనే చెప్పాలి. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఇప్పుడు గుడ్ లక్కీ సఖి అనే సినిమా చేస్తుంది. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ సినిమాలో..

ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నగేశ్ కుకునూర్ దర్శకుడు. ఈసినిమా దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ చిత్రబృందం నేడు ‘ఇంతందంగా’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి అంకుల్ కు అంకితం ఇస్తున్నాం. నా గొంతు బాగుంటుందని ఆయన ఎప్పుడూ మెచ్చుకునేవారు. ఈ పాటను నేనే పాడాను. అందుకే ఈ పాటనే ఆయనకు అంకితం ఇవ్వాలని నిర్ణయించాం” అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇటీవలే అనారోగ్యంతో కాలం చెందిన విషయం తెలిసిందే.. సిరివెన్నెల కన్నుమూతతో సీనీలోకంలో నల్లమబ్బులు కమ్ముకున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!