ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్న టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో రాబోతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ నెట్టింట్లో రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్ మొదటి సారి పాపు సాంగ్‌లో నటించింది. మొట్ట మొదటి సారి గాంధారి అనే పాప్ సాంగ్ ఆల్బమ్ చేసింది కీర్తి సురేష్. సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్మెంట్, ది రూట్ అసోషియేషన్‌లో ఈ సాంగ్ రూపొందింది. సోమవారం గాంధారి మ్యూజికల్ వీడియోను విడుదల చేశారు.
విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇందులో కీర్తి సురేష్ అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ చూపరులను కట్టి పడేశాయి. ఇందులో కీర్తి సురేష్ అభినయం.. ఆకృతి… డ్యాన్స్ మొత్తం ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. ‘గాంధారి.. గాంధారి.. నీ మరిది.. గాంధారి.. దొంగ చందమామలా ఒంగి చూసిండే’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో రచ్చ చేస్తుంది. రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను సింగర్ అనన్య భట్ అందంగా ఆలపించారు…
‘‘గాంధారి’ లాంటి మ్యూజికల్ వీడియోలో యాక్ట్ చేయడం ఇదే తొలిసారి నాకు కూడా ఓ ఎక్స్‌పెరిమెంట్‌గా అనిపించింది. రూట్, సోనీ మ్యూజిక్‌కి థాంక్స్. సారంగ దరియా తర్వాత గాంధారితో వపన్ మరో హిట్ అందుకున్నారు. సుద్దాలగారు అద్భుతంగా పాట రాశారు. బృందగారితో, నేను ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న్పపుడు వర్క్ చేశాను. అలాగే ఆమె కొరియోగ్రఫీలో వర్క్ చేశాను. అలాగే ఆమె డైరెక్షన్‌లోనూ పనిచేయడం కొత్త అనుభూతినిచ్చింది.రెండు రోజుల్లో ఈ సాంగ్ షూట్ చేశాం. ఈ ఆల్బమ్‌లో భాగమైన టెక్నికల్ టీమ్ ఎంతో కష్టపడ్డారు. అందరికీ థాంక్స్’’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.
Adipurush: ఆదిపురుష్ స్టోరీ ఇదే అంటూ డైరెక్టర్ క్లారిటీ.. ప్రభాస్ రాముడు కాదంటూ..
Naresh: సినీ నటుడు నరేశ్ పేరుతో మహిళ భారీ మోసం.. లక్షల్లో వసూళ్లు.. ఆమెతో సంబంధం లేదంటూ..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ సినిమాలో..