Kavya Maran-Anirudh: కావ్య మారన్- అనిరుధ్‌ల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్.. అతిథుల లిస్ట్‌లో ఏకైక టాలీవుడ్ హీరో!
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్‌ల వివాహం నవంబర్ 10,11 తేదీల్లో జరగనుంది. గ్రీస్ వేదికగా జరిగే ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా అంగరంగం వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిసెప్షన్‌కు సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ కో ఓనర్ కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వచ్చేనెల 10, 11 తేదీల్లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రీస్ వేదికగా జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయిని సమాచారం. ఈ పెళ్లి వేడుకలో కేవలం ఇరు కుటుంబాలతో పాటు కావ్య- అనిరుధ్ ల అత్యంత దగ్గరి స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు. ఇక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్ 21న వెడ్డింగ్ రిసెస్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ లో జరిగే ఈ వేడుకకు ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తో సహా పలువురు ప్రముఖ సినీ, రాజకీయ నాయకుల హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు హాజరు కానున్నారని తెలుస్తోంది. అనిరుధ్ మామ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి, అజిత్ కుమార్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆహ్వానితులలో ఉన్నట్లు సమాచారం. కాగా టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే ఈ అతిథుల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ల గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించి ఆహ్వానాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఇన్విటేషన్ బాక్స్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్‌ను అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఐవరీ రంగు బాక్స్‌పై లేత నీలి రంగు ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఇన్విటేషన్ బాక్స్ చాలా అద్బుతంగా ఉందంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా బాక్స్‌పై ఎంబాస్డ్ అక్షరాలు, వింటేజ్ లుక్స్ ఉన్న సీల్ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రశంసిస్తున్నారు.
కావ్య మారన్- అనిరుధ్‌ల గ్రాండ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




