Kartikeya Gummakonda : ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్‌లోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తన అద్భుత నటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్ హీరో. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘రాజా విక్రమార్క’ నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. లవ్-యాక్షన్- ఎమోషన్‌తో కూడిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల బక్రీద్ సందర్భంగా.. ఈ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో కార్తికేయ.. ముస్లిం వేషధారణలో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అయితే హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాత రామారెడ్డి మాట్లాడుతూ..”సినిమా పరిశ్రమలో నా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నేను ఈ సినిమాను నిర్మించాను. నిర్మాతగా నేను చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు కార్తికేయ అయితే బాగుంటాడని ఆయనను సంప్రదించడం జరిగింది. ఈ సినిమా ఫంక్షన్‌కి చిరంజీవిగారిని పిలవాలని అనుకుంటున్నాము. ఇక పై మా బ్యానర్లో వరుస సినిమాలు ఉంటాయి అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :