AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రారంభమైన కార్తీ, జ్యోతిక సినిమా.. ప్రీలుక్ రిలీజ్

రియల్ లైఫ్‌ వదినా మరిది కార్తీ, జ్యోతిక ముఖ్య పాత్రలలో కోలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్(దృశ్యం ఫేమ్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడు నటుడు సత్యరాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకున్న ఈ చిత్రం ఇవాళ్టి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ విషయాన్ని కార్తీ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘వదినతో మొదటిసారిగా స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం చాలా […]

ప్రారంభమైన కార్తీ, జ్యోతిక సినిమా.. ప్రీలుక్ రిలీజ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2019 | 1:32 PM

Share

రియల్ లైఫ్‌ వదినా మరిది కార్తీ, జ్యోతిక ముఖ్య పాత్రలలో కోలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్(దృశ్యం ఫేమ్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడు నటుడు సత్యరాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకున్న ఈ చిత్రం ఇవాళ్టి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ విషయాన్ని కార్తీ సోషల్ మీడియాలో వెల్లడించాడు.

‘‘వదినతో మొదటిసారిగా స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జీతూ జోసెఫ్ సర్ మీతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సత్యరాజ్ సర్ మీరు ఈ సినిమాలో ఉండటం మాకు మరింత బలాన్ని ఇస్తుంది. మీ అందరి ఆశీస్సులతో ఇవాళ్టి నుంచి షూటింగ్ ప్రారంభం అవుతోంది’’ అంటూ కార్తి ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశాడు.

దీనికి కార్తీ సోదరుడు, నటుడు సూర్య స్పందిస్తూ.. ‘‘ఇది చాలా స్పెషల్ ప్రాజెక్ట్. నిన్ను, జ్యోను(సూర్య, జ్యోతికను పిలుచుకునే పేరు) స్క్రీన్ మీద చూసేందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నా. అద్భుత టీమ్‌కు గుడ్‌లక్’’ అంటూ కామెంట్ పెట్టాడు.

కాగా ప్రీలుక్‌లో దట్టమైన అటవి, లోయ, మేఘాల మధ్య కార్తి లుక్ అస్పష్టంగా కనిపిస్తోంది. ఇక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వైకామ్18 స్టూడియోస్, పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 96ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?
అంత సపోర్ట్ చేశారు కదా.. చివరి క్షణంలో ఏమైందంటూ..
అంత సపోర్ట్ చేశారు కదా.. చివరి క్షణంలో ఏమైందంటూ..
విరాట్ కోహ్లీ డైట్‌లో ఉండే ఆ స్పెషల్ ఫుడ్ ఏంటో తెలుసా?
విరాట్ కోహ్లీ డైట్‌లో ఉండే ఆ స్పెషల్ ఫుడ్ ఏంటో తెలుసా?