AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌! అనుకోకుండా తేనెటీగ మింగి క్షణాల్లోనే..

ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ (53) గురువారం (జూన్‌ 12) హఠాన్మరణం చెందారు. ఇంగ్లాండ్‌లో ఉన్న ఆయన గ్రౌండ్‌లో పోలో మ్యాచ్ ఆడుతూ ఒక్కసారిగా గుండెపోటు కుప్పకూలారు. సంజ‌య్ పోలో ఆటాడుతున్న స‌మ‌యంలో తేనెటీగ పొరబాటున నోట్లోకి ప్రవేశించింది. దీంతో ఆయనకు తెలియకుండానే దానిని మింగేశారు. దీంతో..

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌! అనుకోకుండా తేనెటీగ మింగి క్షణాల్లోనే..
Sanjay Kapoor
Srilakshmi C
|

Updated on: Jun 13, 2025 | 10:33 AM

Share

గ‌త కొద్ది రోజులుగా సినీ ప‌రిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్‌ ద‌ర్శకుడు ఏఎస్ రవి కుమార్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన మ‌రిచిపోక‌ముందే మరో సీనియర్ ప్రొడ్యూసర్‌ కె. మహేంద్ర (79) క‌న్నుమూసారు. ఈ రెండు విషాదాల నుంచి కోలుకోకముందే బాలీవుడ్‌లో మరో షాకింగ్‌ ఘనట చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ (53) గురువారం (జూన్‌ 12) హఠాన్మరణం చెందారు. ఇంగ్లాండ్‌లో ఉన్న ఆయన గ్రౌండ్‌లో పోలో మ్యాచ్ ఆడుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. సంజ‌య్ పోలో ఆటాడుతున్న స‌మ‌యంలో తేనెటీగ పొరబాటున నోట్లోకి ప్రవేశించింది. దీంతో ఆయనకు తెలియకుండానే దానిని మింగేశారు. దీంతో తీవ్రమైన రియాక్షన్‌ వచ్చి ఊపిరాడక గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. వైద్యులు త‌క్షణ‌మే స్పందించి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడ‌లేక పోయారు.

కాగా 1990ల‌లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన క‌రిష్మా క‌పూర్.. 2003 సెప్టెంబర్‌ 29న సంజ‌య్ క‌పూర్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఈ జంట లండ‌న్‌లో స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పదేళ్లపాటు సాఫీగా సాగిన వీరికాపురంలో అనుకోని మనస్పర్ధలు వచ్చాయి. దీంతో 2014లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. 2016లో అధికారికంగా విడాకులు మంజూరైనాయి.

ఇవి కూడా చదవండి

Karisma Kapoor's Ex Husband

అదే ఏడాది మాజీ భర్త సంజయ్‌, అతని తల్లిపై గృహ హింస కేసు కూడా పెట్టింది. శారీరకంగా హింసించాడని, సంజయ్‌కు వేరే మహిళతో ఎఫైర్‌ ఉన్నట్లు ఆరోపించింది. వరకట్నం వేధింపులు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపింది. దీంతో ఈ కేసు వ్యవహారం ఇంకా కోర్టులోనే సాగుతూ ఉంది. ఈ దంపతులకు సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి విడాకుల తర్వాత సంజయ్ కపూర్.. ప్రియా సచ్‌దేవ్‌ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక క‌రిష్మా క‌పూర్ మాత్రం అప్పటి నుండి సింగిల్‌గానే ఉంటుంది.

అయితే సంజయ్ కపూర్ మరణానికి కొన్ని గంటల ముందు గురువారం మధ్యాహ్నం జరిగిన అహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై బాధితులకు సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆయన మృతి చెందారు. సంజయ్‌ కపూర్‌ మృతిపట్ల పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన పలువరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే