Devi Sri Prasad: ముదురుతున్న వివాదం.. దేవీ శ్రీ ప్రసాద్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు

|

Nov 04, 2022 | 4:27 PM

సినీ నటి కరాటే కళ్యాణి దేవిశ్రీ ప్రసాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తోపాటు పలు హిందు సంఘాలు కూడా దేవీశ్రీ పై ఫిర్యాదు చేశాయి.

Devi Sri Prasad: ముదురుతున్న వివాదం.. దేవీ శ్రీ ప్రసాద్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు
Devi Sri Prasad
Follow us on

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ చిక్కులో పడ్డ విషయం తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు నమోదైంది. సినీ నటి కరాటే కళ్యాణి దేవిశ్రీ ప్రసాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తోపాటు పలు హిందు సంఘాలు కూడా దేవీశ్రీ పై ఫిర్యాదు చేశాయి. దానికి కారణం ఏంటంటే దేవి శ్రీ కంపోజ్ చేసిన ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ , హరే కృష్ణ మంత్రాన్నివాడారు. అయితే ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో హరే రామ హరే కృష మంత్రం ఎలా వాడుతారని దేవీ పై కంప్లెయింట్ చేశారు కరాటే కళ్యాణి. అలాగే  ఆ సాంగ్‌లో పవిత్ర మంత్రాన్ని అపహస్యం చేశాడంటూ బీజేపీ భగ్గుమంది. వివాదంపై బీజేపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దేవుడిపై దేవీ తీరును తప్పుబడుతూ.. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌ రెడ్డి.. కూడా దేవీ శ్రీ ప్రసాద్‌ పై తీరుపై మండిపడ్డారు.

ఇక దేవీ శ్రీ ప్రసాద్ ఫై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో దేవిశ్రీ ప్రసాద్ మీద కరాటే కళ్యాణి, లలిత్ కుమార్ చేసిన కంప్లెయింట్ ఆధారంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఇక దేవీ గతంలో కూడా.. దేవుడిపై మాట్లాడి కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారారు. పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్‌ను .. దేవుడి పాటగా పాడి హిందువులకు కోసం తెప్పించారు. అసలు దేవుడి పాటలన్నీ ఐటం సాంగ్సేనంటూ విపరీత వ్యాఖ్యలు చేసి.. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి..