Kantara 2 Pre Release Event Highlights: కాంతార 2 ఘనవిజయం సాధిస్తుంది: ఎన్టీఆర్

భారీ బడ్జెట్‌తో ‘కాంతారా : చాప్టర్ 1’ సిసిద్ధమైంది. అక్టోబర్ 2న ‘కాంతారావు: చాప్టర్ 1’ని విడుదల కానుంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతారా: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు. 

Kantara 2 Pre Release Event Highlights: కాంతార 2 ఘనవిజయం సాధిస్తుంది: ఎన్టీఆర్
Kantara Chapter 1

Updated on: Sep 28, 2025 | 7:50 PM

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న తాజా చిత్రం కాంతారా 2. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతారా: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు.  ‘హోంబాలే ఫిల్మ్స్’ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాంతార 2 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కుందాపూర్‌లో జరుగుతోంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా పైనే దృష్టి సారించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Sep 2025 07:38 PM (IST)

    కాంతార సినిమా అదిపెద్ద విజయాన్ని సాధిస్తుంది: ఎన్టీఆర్

    ఈ సినిమా మనందరినీ రంజింప చేస్తుందని.. గొప్ప బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఇండియన్ చరిత్రలో ఈ సినిమా పేరు ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాంతార సినిమా అదిపెద్ద విజయాన్ని సాధిస్తుంది. అక్టోబర్ 2న సినిమా చూడండి. నా బ్రదర్ పడ్డ కష్టానికి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నా.. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

  • 28 Sep 2025 07:36 PM (IST)

    నన్ను దగ్గరుండి గుడికి తీసుకెళ్లారు: ఎన్టీఆర్

    రిషబ్ అన్ని డిపార్ట్మెంట్స్ ను డామినేట్ చేశాడు. మా అమ్మగారు ఎప్పుడూ ఉండే కోరిక.. ఉడిపి కృష్ణుడి గుడికి వెళ్లాలని ఉండేది. నన్ను దగ్గరుండి గుడికి తీసుకెళ్లారు. దగ్గరుండి నాకు దర్శనం చేయించారు. నన్ను కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. నన్ను చాలా గుళ్లకు తీసుకెళ్లారు రిషబ్.


  • 28 Sep 2025 07:33 PM (IST)

    నేను చిన్నప్పుడు విన్న కథను.. ఇప్పుడు సినిమాగా చేశాడు రిషబ్: తారక్

    అభిమాన సోదరులకు నా నమస్కారాలు.. నేను మొట్టమొదటిసారి నా వయసు 4ఏళ్ళవయసులో మా అమ్మమ్మ కొన్ని కథలు చెప్పింది. అప్పుడు నాకు అర్ధమయేది కాదు. అప్పుడు ఎన్నో డౌట్స్ ఉండేవి. గుళిగా ఆట అంటే ఏంటి.? పింజర్లి అంటే ఏంటి అనేది తెలుసుకోవాలని ఉండేది.. కానీ ఇప్పుడు నా బ్రదర్ రిషబ్ ఇప్పుడు సినిమాగా తీసుకు వస్తున్నాడు.

  • 28 Sep 2025 07:31 PM (IST)

    కొంచం నొప్పిగా ఉంది.. అరిచి మాట్లాడలేను: ఎన్టీఆర్

    కొంచం నొప్పిగా ఉంది.. అరిచి మాట్లాడలేను.. అర్ధం చేసుకోండి అని ఎన్టీఆర్ అన్నారు.

  • 28 Sep 2025 07:30 PM (IST)

    కాంతార‌కు మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేనిది: రిషబ్ శెట్టి

    కాంతార కు మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేనిది. ఈ సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని రిషబ్ శెట్టి అన్నారు.

  • 28 Sep 2025 07:29 PM (IST)

    తారక్ నాకు సోదరుడు : రిషబ్ శెట్టి

    మీ ప్రేమకు , సపోర్ట్ కు చాలా ధన్యవాదాలు, ఎన్టీఆర్ నా స్నేహితుడని చెప్పాలా, నా బ్రదర్ అని చెప్పాలా.. ఆయన ఓ తెలుగు హీరో అనే ఫీలింగ్ నాకు లేదు. ఆయన నా సోదరుడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నప్పుడు నన్ను వెన్ను తట్టి ఎంకరేజ్ చేశారు తారక్.

  • 28 Sep 2025 07:25 PM (IST)

    కలిసి స్టేజ్ పైకి వచ్చిన ఎన్టీఆర్, రిషబ్ శెట్టి..

    కలిసి స్టేజ్ పైకి వచ్చిన ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. దద్దరిల్లిన ఆడిటోరియం.. జై తారక్ నినాదంతో హోరెత్తిన ఆడిటోరియం

  • 28 Sep 2025 07:12 PM (IST)

    ఎన్టీఆర్‌గారి గురించి ఒక వర్డ్‌లో చెప్పలేం.. ఆయన ఓ డిక్షనరీ : రుక్మిణి

    ఎన్టీఆర్‌గారు మొదటి నుంచి ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. సొంత సినిమాలా ఆయన ట్రీట్ చేశారు. కాంతార సినిమా నాకు చాలా స్పెషల్. మన సినిమా అక్టోబర్ 2న రానుంది. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన రిషబ్‌గారికి చాలా థ్యాంక్స్.. రిషబ్ శెట్టి గారు ఓ డివైన్ స్టార్.. ఎన్టీఆర్ గారి గురించి ఒక వర్డ్ లో చెప్పలేం.. ఆయన ఓ డిక్షనరీ అని రుక్మిణి వసంత్ అన్నారు.

  • 28 Sep 2025 07:04 PM (IST)

    తారక్ అన్నయ్యా అంటూ అదరగొట్టిన రిషబ్ శెట్టి భార్య

    తారక్ అన్నయ్యా అంటూ అదరగొట్టిన రిషబ్ శెట్టి భార్య.. మీరు చూపిస్తున్న ప్రేమకు ఎంతో ధన్యవాదాలు అన్నయ్య అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.. దర్శకుడిగా రిషబ్ శెట్టికి ఎక్కువ మార్కులు వేస్తాను అన్నారు ప్రగతి శెట్టి.

  • 28 Sep 2025 06:58 PM (IST)

    ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన ఆడిటోరియం..

    ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన ఆడిటోరియం.. తారక్ ను చూడగానే ఫ్యాన్స్ ఈలలతో సందడి చేశారు. ఆడిటోరియం హోరెత్తింది.

  • 28 Sep 2025 06:57 PM (IST)

    గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్

    గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కాంతార 2 ఈవెంట్ కు తారక్ అదిరిపోయే ఎంట్రీ..

  • 28 Sep 2025 06:45 PM (IST)

    భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చిన హీరో రిషబ్ శెట్టి

    ఈవెంట్ కు హాజరైన హీరో రిషబ్ శెట్టి.. భార్యతో కలిసి హాజరైన రిషబ్ శెట్టి

  • 28 Sep 2025 06:44 PM (IST)

    ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్..

    ఈవెంట్‌కు హాజరైన రుక్మిణి వసంత్.. చీరకట్టులో అదరగొట్టిన రుక్మిణి..

  • 28 Sep 2025 06:42 PM (IST)

    మొదలైన కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్..

    గ్రాండ్‌గా మొదలైన కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా హాజరుకానున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరుకానున్నారు.