Kannappa: రిలీజ్‌కు ముందు కన్నప్ప యూనిట్‌కు ఒక గుడ్ న్యూస్‌, ఒక బ్యాడ్ న్యూస్

కన్నప్ప రిలీజ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉంది. నార్త్ టు సౌత్‌ అన్ని భాషల కీలక నటులతో తెరకెక్కించిన కన్నప్ప.. పాన్ ఇండియా మూవీ అంటూ నెక్ట్స్ లెవల్ ప్రమోషన్ చేశారు. అయితే.. రిలీజ్‌కు ముందు కన్నప్ప యూనిట్‌కు ఒక గుడ్ న్యూస్‌, ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇంతకీ.. ఏంటా గుడ్ అండ్ బ్యాడ్‌ న్యూస్‌?.

Kannappa: రిలీజ్‌కు ముందు కన్నప్ప యూనిట్‌కు ఒక గుడ్ న్యూస్‌, ఒక బ్యాడ్ న్యూస్
Kannappa Movie Review

Updated on: Jun 26, 2025 | 7:20 AM

కన్నప్ప టైటిల్‌ అనౌన్స్ నుంచి సినిమా పూర్తి వరకు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంది. నార్త్ టు సౌత్ అన్ని వుడ్‌లకు సంబంధించిన ప్రధాన నటులు ఈ మూవీలో ఉన్నారు. కన్నప్ప సినిమా రిలీజ్‌కు ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. మాస్టర్‌ కాపీ రెడీగా ఉన్న సమయంలో కన్నప్ప నిర్మాతకు సెంట్రల్ టీమ్స్ షాకిచ్చాయి. హీరో, నిర్మాత మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం తనిఖీలు చేసింది. మాదాపూర్‌, కావూరి హిల్స్‌లోని ఆఫీస్‌ల్లో రెండు బృందాలు తనిఖీలు చేశాయి. మంచు విష్ణు నిర్మించిన ‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సినిమా బడ్జెట్, జీఎస్టీ చెల్లింపుల ఫైల్స్ పరిశీలించారు. మరోవైపు, విష్ణు కార్యాలయానికి సినీనటుడు మోహన్‌బాబు, రచయిత కోన వెంకట్‌ వెళ్లారు. జీఎస్టీ ఆఫీసర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

జీఎస్టీ తనిఖీలపై స్పందించిన మంచు విష్ణు.. రెయిడ్స్ విషయం తనకు తెలియదన్నారు. అయినా ఇందులో దాచి పెట్టేదేమీ లేదని తెలిపారు. జీఎస్టీ రైడ్స్‌తో తాము ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుందన్నారు విష్ణు.

మరోవైపు జీఎస్టీ రైడ్స్ వేళ.. ఏపీ సర్కార్ కన్నప్ప టీమ్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. 10 రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో.. హయ్యర్‌ క్లాస్‌ టికెట్‌ రేట్లు 50 రూపాయలు (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.

శుక్రవారం రిలీజ్‌ కానున్న కన్నప్ప సినిమా విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు. దాదాపు పదేళ్లు ఆయన దీని కోసం వర్క్‌ చేశారు. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో విష్ణు టైటిల్‌ పాత్ర పోషించగా.. రుద్రగా ప్రభాస్‌, కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .