Shivarajkumar: శివన్నకు సర్జరీ.. త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..

|

Dec 24, 2024 | 8:50 AM

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాసర్ బారిన పడిన విషయం తెలిసిందే.. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ రోజు శివరాజ్ కుమార్ కు శస్త్ర చికిత్స జరగనుంది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. బెంగుళూరులో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు శివరాజ్ కుమార్.

Shivarajkumar: శివన్నకు సర్జరీ.. త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..
Shivarajkumar
Follow us on

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు శివ రాజ్ కుమార్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ రోజు (డిసెంబర్ 24) అమెరికాలోని మియామీలోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరగనుంది. సర్జరీ విజయవంతం కావాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. అంతే కాదు పలు ప్రాంతాల్లో పూజలు చేస్తున్నారు. శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి : మెంటల్ మాస్ మావ.! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

శివరాజ్‌కుమార్ కు కన్నడ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. శివన్న ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే శివరాజ్ కుమార్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడేటంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శివరాజు కుమార్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు.  బెంగుళూరులో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెతున్నారు శివన్న.

ఇది కూడా చదవండి :17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యింది.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్.. ఆ తప్పులే కారణం

డిసెంబర్ 18న శివరాజ్‌కుమార్ తన భార్య గీతా శివరాజ్‌కుమార్‌తో కలిసి అమెరికా వెళ్లారు. అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్‌కుమార్‌ను కలిశారు. శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం కుదుటపడాలని పూజలు చేస్తున్నారు. చామరాజనగర్‌లోని శివన్న అభిమానులు తాజాగా దేవుడు పాదాల దగ్గర శివరాజ్ కుమార్ ఫోటోలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. మైసూరు విద్యార్థులు కూడా శివన్న ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శివరాజ్‌కుమార్‌కు ఈరోజు శస్త్ర చికిత్స జరగనుంది. సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆయన అక్కడే ఉంటాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రానున్నారు. జూన్ లో తిరిగి శివన్న సినిమా సెట్స్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే శివరాజ్‌కుమార్‌ నటించిన ‘భైరతి రంగల్‌’  విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన నటిస్తున్న ’45’ చిత్రం పనులు కూడా పూర్తికానున్నాయి.

ఇది కూడా చదవండి :పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ భామ.. విడాకులు తీసుకున్న వ్యక్తితో వివాహం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి