కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు. అభిమానుల కోరిక నెరవేరింది. శివరాజ్ కుమార్ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం (డిసెంబర్ 24) సాయంత్రం 6 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు) శివరాజ్ కుమార్ కు ఆపరేషన్ జరిగిందని తెలుస్తుంది . 4-5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని శివరాజ్ కుమార్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
శివరాజ్‌కుమార్ మొదటి నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నారు. తన ఆరోగ్యం గురించి ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకున్నారు. అలాగే సర్జరీ జరిగినప్పుడు కూడా పాజిటివ్‌గా ఉన్నారు. ఆనందంగానే అమెరికా వెళ్లి సర్జరీ పూర్తి చేసుకున్నారు. శివరాజ్ కుమార్ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. శివరాజ్‌కుమార్ త్వరగా కోలుకోవాలని చాలా మంది పూజలు నిర్వహించారు. శివన్న అభిమానుల పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు అన్నీ ఫలించాయి.
శివరాజ్‌కుమార్‌కు క్యాన్సర్ బారిన పడిన దగ్గర నుంచి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. శివన్న చికిత్స కోసం అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ ఆరు గంటల పాటు కొనసాగింది. డా. మురుగేష్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ శివన్న45’ సినిమా పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు. ఇప్పుడు కొన్ని నెలలు విరామం తీసుకున్న తర్వాత శివన్న మళ్లీ నటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి