
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ స్టార్ హీరోగా కన్నడ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శివన్నకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్‌ను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆహ్వానించారు. అయితే డీకే ఆఫర్‌ను శివరాజ్ కుమార్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. నేను నటుడిని మాత్రమే. తనకు రాజకీయాలు తెలియవని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శివన్న అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్నీ డీకే శివకుమార్ తెలిపారని తెలుస్తోంది.
బెంగుళూరులో జరిగిన ఈడిగ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు శివన్న. లోక్‌సభ ఎన్నికలు శివరాజ్ కుమార్ పోటీచేదం లేదు అని డీకే శివకుమార్ తెలిపారు. శివన్న మాట్లాడుతూ.. మా నాన్నగారు ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగించాలి. మేకప్ వేసుకోవడం, నటుడిగా ప్రేక్షకులను మెప్పించాలి అదే నాకు మానాన్న ఇచ్చిన గిఫ్ట్. నేను నటుడిని కేవలం నటన మాత్రమే నాకు తెలుసు రాజకీయాలు తెలియవు. కాబట్టి తాను ఎప్పటికి రాజకీయాల్లోకి రానని శివరాజ్ కుమార్ తెలిపారు.
శివరాజ్ కుమార్ భార్య గీతకి ఆసక్తి ఉంటే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనివ్వండి అని అడిగారట శివన్న. తన భార్యకు నచ్చితే ఆమెకు మద్దతుగా ఉంటానని అన్నారట. గీత పోటీ చేస్తే సపోర్ట్ చేస్తానని స్పష్టం చేశారు శివన్న. ఎందుకంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు శివన్న భార్య గీత. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఏ నాడు బంగారప్ప కానీ , ఆయన కూతురు భార్య గీత కానీ శివన్నను అడగలేదట. కానీ తన భార్య గీత పోటీ చేస్తే తప్పకుండ మద్దతు తెలుపుతా అని శివన్న చెప్పారట. గీత ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.