Divya Spandana: సూర్య హీరోయిన్ చనిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ..

|

Sep 06, 2023 | 1:57 PM

ఇటీవల మరో హీరోయిన్ మృతి చెందారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ప్రముఖ కన్నడ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివ్య స్పందన చనిపోయారంటూ వార్తలు వైరలయ్యాయి. కొన్నాళ్ల క్రితం తమిళనాడులోని పలు ఛానల్స్ రమ్య ఆకస్మిక మృతి అని.. గుండెపోటుతో 40 ఏళ్ల వయసులోనే మరణించారంటూ ప్రచారం జరిగింది. గత రెండు మూడు రోజుల క్రితం మరోసారి రమ్య స్పందన చనిపోయారంటూ ఓ ట్వీట్ తెగ హల్చల్ చేసింది. దీంతో రమ్య కుటుంబ సభ్యులు స్పందించారు.

Divya Spandana: సూర్య హీరోయిన్ చనిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ..
Divya Spandana
Follow us on

నిత్యం సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా సినీ తారల పర్సనల్ విషయాలపైనే నెటిజన్స్ ఫోకస్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ సినీ పరిశ్రమలోని కొందరు హీరోహీరోయిన్స్ చనిపోయారంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫేక్ న్యూస్ పై సదరు నటీనటులు స్పందించి ఆ వార్తలు అవాస్తవం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇక ఇటీవల మరో హీరోయిన్ మృతి చెందారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ప్రముఖ కన్నడ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివ్య స్పందన చనిపోయారంటూ వార్తలు వైరలయ్యాయి. కొన్నాళ్ల క్రితం తమిళనాడులోని పలు ఛానల్స్ రమ్య ఆకస్మిక మృతి అని.. గుండెపోటుతో 40 ఏళ్ల వయసులోనే మరణించారంటూ ప్రచారం జరిగింది. గత రెండు మూడు రోజుల క్రితం మరోసారి రమ్య స్పందన చనిపోయారంటూ ఓ ట్వీట్ తెగ హల్చల్ చేసింది. దీంతో రమ్య కుటుంబ సభ్యులు స్పందించారు.

ప్రస్తుతం రమ్య బాగానే ఉన్నారని.. కొద్ది రోజులుగా స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో రమ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అభి సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రమ్య స్పందన. తొలి సినిమాతోనే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇక తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రమ్యకు తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు.

అభిమన్యు తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న రమ్య.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య జోడిగా ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తమిళంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. ఆ తర్వాత కన్నడ, తమిళంలో పలు సినిమాలు చేశారు. ఇటీవల తెలుగులోకి డబ్ అయిన బాయ్స్ హాస్టల్ కన్నడ వెర్షన్ లో రమ్య అతిథి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆమె ధనంజయ్ నటిస్తోన్న ఉత్తరకాండ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను కేఆర్జీ స్టూడియో ఈ సినిమాను నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.