ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ చిత్రంపైనే ఉన్నాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఎన్నో అంచనాలతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇటీవల కొద్ది రోజలుగా ఈమూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఇందులో కీలకపాత్రలో నటిస్తున్న కన్నడ నటుడు దేవరాజ్ సలార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు అభిమానులకు తెలియని సీక్రెట్ రివీల్ చేశారు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోన్న సలార్ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో తాను పోషించే పాత్ర చాలా కీలకమైనదని.. అన్నారు దేవరాజ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సలార్ సినిమా గురించి మాట్లాడుతూ.. “మొదటి భాగంలో నేను ఎక్కువగా కనిపించను. కానీ రెండవ భాగంలో ప్రభాస్ తో ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లో కాంబోలో అనేక సన్నివేశాలు ఉంటాయి.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు.
ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులు ఊహించని సీక్రెట్ రివీల్ కావడంతో సలార్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతోపాటు.. ప్రాజెక్ట్ కె మూవీ చేస్తున్నారు ప్రభాస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.