Arjun Sarja: హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తల్లి లక్ష్మీ దేవమ్మ మృతి..

గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న దేవమ్మ.. బెంగుళూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Arjun Sarja: హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తల్లి లక్ష్మీ దేవమ్మ మృతి..
Arjun

Updated on: Jul 23, 2022 | 1:26 PM

కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా (Arjun Sarja) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీ దేవమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న దేవమ్మ.. బెంగుళూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో అర్జున్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

దేవమ్మ మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం. దేవమ్మ మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Arjun Sarja

 

ఇవి కూడా చదవండి